పాస్‌పోర్టు పొందడం ఇలా..
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టు కావాలంటే గతంలో పోస్టాఫీసు, ఈ సేవ కేంద్రాల ద్వారా గానీ దరఖాస్తు చేసుకునే వాళ్లం. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే.. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయాలంటే వెబ్‌సైట్ (www.passportindia.gov.in)లోని దరఖాస్తు ఫారంలో వారడిగిన అన్ని ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని అందులోనే ఫీడ్ (నింపాలి) చేయాలి. రూ.1500 రుసుమును రీజినల్ పా్‌స్‌పోర్టు ఆఫీసర్, హైదరాబాద్ పేరు మీద ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
అనంతరం హైదరాబాద్‌లో ఉన్న బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌక్‌లోని మూడు పాస్ట్‌పోర్టు సేవా కేంద్రాలలో ఏది మీకు సమీపంలో ఉంటుందో దానిని ఎంపిక చేసుకుని సమాచారాన్ని పంపించాలి. ఆ సెంటర్ నుంచి మీకు 40 రోజుల లోపు ఫలాన తేదీన పాస్‌పోర్ట్ కార్యాలయానికి రావాలని సమాచారం వస్తుంది. ఆ సమయానికి అరగంట ముందే చేరుకోవాలి. డాక్యుమెంట్లను తప్పకుండా తీసుకెళ్లాలి.
⇒ 1989, జనవరి 26 తర్వాత పుట్టిన వారు మున్సిపల్ కార్యాలయం ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాలి.
⇒ అంతకు ముందు పుట్టిన వారికి బర్త్ సర్టిఫికెట్ అవసరం లేదు.
⇒ విద్యార్థి అయితే బర్త్ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ మెమో, ఏ కళాశాలలో చదువుతున్నాడో ఆ కళాశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్, ఒర్జినల్ కస్టోడియన్ సర్టిఫికెట్‌లు అవసరం.
⇒ నివాసధ్రువీకరణ కింద ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఒక సంవత్సరం బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకెళ్లాలి.
⇒ 1989, జనవరి తర్వాత పుట్టిన నిరక్షరాస్యులకు బర్త్ సర్టిఫికెట్, చదువు కోలేదని రూ.10 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేసి తీసుకెళ్లాలి.
⇒ మహిళలకు 1989 ముందు పుట్టిన వారికి చదువుకుంటే ఎస్‌ఎస్‌సీ మెమో, మ్యారేజ్ సర్టిఫికేట్ అనెగ్జర్ (ఈ) పది రూపాయల స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయాలి. చదువుకోకపోతే నోటరీ చేయించుకోవాలి.
⇒ చిన్న పిల్లలకు పాస్ట్‌పోర్టు కావాలంటే వారి తల్లిదండ్రులకు పాస్ట్‌పోర్టు ఉన్నట్లయితే వీరికి బర్త్ సర్టిఫికెట్‌తో పాటు పేరెంట్స్ డిక్లరేషన్ ఇస్తే వెరిఫికేషన్ లేకుండానే పాస్‌పోర్టు వస్తుంది.