సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్థిరీకరణలో కీలకమైన ఇంటి అద్దె భత్యానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆర్థిక శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటివరకు మూల వేతనంలో 8 శాతం లేదా గరిష్టంగా నెలకు రూ.వెయ్యి చొప్పున ఇంటి అద్దె భత్యం చెల్లించేవారు.
అయితే ఇకపై పదో పీఆర్‌సీ సిఫార్సు ప్రకారం మూలవేతనంలో 8 శాతం లేదా గరిష్టంగా రూ.2 వేలు చెల్లించాలని సర్కారు నిర్ణయించింది. టైపిస్టు, స్టెనోగ్రాఫర్లు, టైపిస్ట్ కం అసిస్టెంట్స్‌కు సంబంధించి ప్రత్యేక వేతనాల ఉత్తర్వును కూడా జారీ చేసింది.
ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు
Published Wed, Apr 22 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM
Advertisement