చనిపోయూడంటూ పెన్షన్ తీసుకుంటున్న భార్య
మూడేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు
మహబూబాబాద్ : భార్యాభర్తల మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పిల్లలను భర్త దగ్గరే వదిలేసిన ఆ మహిళ వెళ్లిపోరుుంది. అంతేకాదు.. భర్త చనిపోయూడంటూ వితంతు పింఛన్ కూడా పొందుతోంది. వివరాలిలా ఉన్నారుు.. వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన బూరుగడ్ల రవికి అదే మండలం కౌసల్యదేవిపల్లి గ్రామానికి చెందిన రమాదేవితో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఎనిమిదేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఇద్దరు అమ్మారుులు కూడా జన్మించారు. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు ఏర్పడి పిల ్లలను భర్త వద్దే వదిలేసి రమాదేవి వెళ్లిపోరుుంది. దీంతో రవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పలుమార్లు పెద్దమనుషులు పంచారుుతీలు నిర్వహించి సర్దిచెప్పినా ఆమె వినిపించుకోలేదు. అనంతరం మానుకోట డీఎస్పీ కార్యాలయూనికి పిలిపించినా ఫలితం లేకపోవడంతో తల్లి ఒక అమ్మారుుని, తండ్రి మరో అమ్మారుుని పో షించాలని పోలీసులు చెప్పారు.
అరుుతే కొద్దిరోజుల్లే నే కూతురును తన వద్దకు పంపించిందని, కోర్టులో కేసు నడుస్తున్నా విడాకులు ఇవ్వకుండా, కాపురానికి రాకుండా పిల్లలను, తనను ఇబ్బంది పెడుతోందని రవి వాపోయూడు. తాను బతికుండగానే చనిపోయినట్లుగా ఇంటి పేరు మార్చుకొని వితంతు పింఛన్ పొందుతూ మానుకోట శివారులోని ధర్మన్న కాలనీలో నివాసం ఉంటోందని చెప్పాడు. అధికారులు కూడా పూర్తి వివరాలు తెలుసుకోకుండానే వితంతు పెన్షన్ ఎలా ఇచ్చారని రవి ప్రశ్నించాడు. పోలీసులు మరోసారి ఆమెను పిలిపించి తనకు న్యాయం చేయూలని కోరుతున్నాడు.
భర్త బతికుండగానే.. వితంతు పింఛన్
Published Fri, Feb 12 2016 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement
Advertisement