హైదరాబాద్, న్యూస్‌లైన్: మక్కా మసీదులో ఆదివారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశారుు. మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి ఏడేళ్లు పూర్తి కావడంతో ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఆదివారం పాతబస్తీలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్కా మసీదు, చార్మినార్ తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో వుుస్లింలు వస్తారని భావించినప్పటికీ.. అతి తక్కువ సంఖ్యలో రావడంతో మక్కా మసీదు బోసిపోయింది.
దీనికి కారణం దక్షిణ మండలం పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలే . ఎక్కువ సంఖ్యలో ప్రార్ధనలు చేసుకొనేందుకు వస్తే ఉద్రిక్తతలకు దారి తీయొచ్చని భావించిన పోలీసులు... ఎవరికి వారు తమ ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో ప్రార్ధనలు చేసుకోవాలని శాంతి సంఘం, మోహల్లా కమిటీల ద్వారా ముస్లింలకు సూచించారు. పోలీసుల ప్రయత్నం ఫలించడంతో తక్కువ సంఖ్యలోనే మక్కా మసీదుకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షణ్ణంగా పరిశీలించిన అనంతరమే లోపలికి అనుమతించారు. దక్షిణ వుండలం డీసీపీ సర్వశ్రే ష్ట త్రిపాఠీ, అదనపు డీసీపీ బాబురావు, చార్మినార్ ఏసీపీ దొడ్డపనేని వెంకట నర్సయ్య తదితరులు బందోబస్తును పర్యవేక్షించారు.
డీజేఎస్ నాయకుల అరెస్టు, విడుదల
కిషన్‌బాగ్ సిక్‌చావ్నీలో పోలీసులు ఇటీవల జరిపిన కాల్పులను నిరసిస్తూ దర్సే జీహాద్ ఓ షెహదత్ (డీజేఎస్) అధ్యక్షుడు ఎంఎ మాజీద్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం మదీనా సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శనకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసన తెలిపేందుకు డీజేఎస్ నాయకులు వస్తారని ముందే పసిగట్టిన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నల్లజెండాలు, ప్లకార్డులు పట్టుకొని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దివాన్‌దేవిడి కమాన్ నుంచి మదీనా సర్కిల్‌కు వస్తున్న 13 మంది డీజేఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి చార్మినార్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత సొంత పూచీకత్తుపై అందరినీ విడుదల చేసినట్టు ఇన్‌స్పెక్టర్ యాదగిరి తెలిపారు.
ప్రార్థనలు ప్రశాంతం
Published Mon, May 19 2014 12:16 AM | Last Updated on Fri, Sep 7 2018 1:56 PM
Advertisement
Advertisement