kishan bagh
-
పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య
పోలవరం ఆర్డినెన్స్ తొందరపాటు చర్య అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందుగా అర్డినెన్స్ తేవడం సరైన చర్యల కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. అనంతరం అసదుద్దీన్ విలేకర్లతో మాట్లాడారు. కిషన్‌బాగ్ ఘటనపై జ్యుడిషయల్ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి అసదుద్దీన్ ప్రభుత్వానికి సూచించారు. -
ప్రార్థనలు ప్రశాంతం
హైదరాబాద్, న్యూస్‌లైన్: మక్కా మసీదులో ఆదివారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశారుు. మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి ఏడేళ్లు పూర్తి కావడంతో ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఆదివారం పాతబస్తీలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్కా మసీదు, చార్మినార్ తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో వుుస్లింలు వస్తారని భావించినప్పటికీ.. అతి తక్కువ సంఖ్యలో రావడంతో మక్కా మసీదు బోసిపోయింది. దీనికి కారణం దక్షిణ మండలం పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలే . ఎక్కువ సంఖ్యలో ప్రార్ధనలు చేసుకొనేందుకు వస్తే ఉద్రిక్తతలకు దారి తీయొచ్చని భావించిన పోలీసులు... ఎవరికి వారు తమ ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో ప్రార్ధనలు చేసుకోవాలని శాంతి సంఘం, మోహల్లా కమిటీల ద్వారా ముస్లింలకు సూచించారు. పోలీసుల ప్రయత్నం ఫలించడంతో తక్కువ సంఖ్యలోనే మక్కా మసీదుకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షణ్ణంగా పరిశీలించిన అనంతరమే లోపలికి అనుమతించారు. దక్షిణ వుండలం డీసీపీ సర్వశ్రే ష్ట త్రిపాఠీ, అదనపు డీసీపీ బాబురావు, చార్మినార్ ఏసీపీ దొడ్డపనేని వెంకట నర్సయ్య తదితరులు బందోబస్తును పర్యవేక్షించారు. డీజేఎస్ నాయకుల అరెస్టు, విడుదల కిషన్‌బాగ్ సిక్‌చావ్నీలో పోలీసులు ఇటీవల జరిపిన కాల్పులను నిరసిస్తూ దర్సే జీహాద్ ఓ షెహదత్ (డీజేఎస్) అధ్యక్షుడు ఎంఎ మాజీద్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం మదీనా సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శనకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసన తెలిపేందుకు డీజేఎస్ నాయకులు వస్తారని ముందే పసిగట్టిన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నల్లజెండాలు, ప్లకార్డులు పట్టుకొని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దివాన్‌దేవిడి కమాన్ నుంచి మదీనా సర్కిల్‌కు వస్తున్న 13 మంది డీజేఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి చార్మినార్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత సొంత పూచీకత్తుపై అందరినీ విడుదల చేసినట్టు ఇన్స్పెక్టర్ యాదగిరి తెలిపారు. -
మెజిస్టీరియల్ విచారణ
పాతబస్తీ కాల్పులపై గవర్నర్ ఆదేశం * మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, క్షతగాత్రులకు 50 వేలు ఎక్స్‌గ్రేషియా * కొనసాగుతున్న కర్ఫ్యూ... కోలుకుంటున్న బాధితులు * కిషన్‌బాగ్‌లో డీజీపీ పర్యటన సాక్షి, సిటీబ్యూరో: పాతనగరంలోని సిక్‌చావ్నీలో జరిగిన పోలీస్కాల్పులపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. పోలీసుకాల్పులు ఏకపక్షంగా ఉన్నాయంటూ పలు పార్టీలు ఆరోపిం చినందున గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలపై పోలీసు అధికారులతో గవర్నర్ నరసింహన్ గురువారం సమీక్షించారు. కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.ఆరు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల కయ్యే వైద్యఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా, అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు గురువారం పర్యటించారు. అల్లర్లకు కారణాలు, చేపట్టిన బందోబస్తు గురించి సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. అల్లర్లు, కాల్పులు ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. నేటి వరకు కర్ఫ్యూ పొడిగింపు పాతబస్తీలోని సిక్‌చావ్నీలో విధించిన కర్ఫ్యూను శుక్రవారం వరకు పొడిగించారు. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కర్ఫ్యూను సడలించడంతో ఆ ప్రాంత ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పరుగులు తీశారు. అనంతరం తిరిగి కర్ఫ్యూ విధించారు. అల్లర్లలో మృతిచెందిన ముగ్గురి కుటుంబాలతో పాటు గాయపడిన వారికి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి, తహసీల్దార్ అశోక్‌కుమార్ ఆర్థిక సహాయం కింద చెక్‌లను అందజేశారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కిషన్‌బాగ్, రాజేంద్రనగర్ ప్రాంతాలలో అదనపు బలగాలను కూడా మోహరించారు. ప్రశాంతతకు మజ్లిస్ భంగం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకు మజ్లిస్ పార్టీ యత్నిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల అనంతరం ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కుట్ర పన్నిందని, ఆ కోణంలోనే రాజేంద్రనగర్ శివారులోని సిక్‌చావ్నీలో మతఘర్షణలు చోటుచేసుకున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున శుక్రవారం మజ్లిస్ నేతలపై పోలీసులు దృష్టి పెట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
పాతబస్తీలో తీవ్ర ఘర్షణలు
-
పాతబస్తీలో ఘర్షణలు
కిషన్‌బాగ్‌లోని సిక్ చావ్నీలో జెండా విషయమై వివాదం ఇరువర్గాల పరస్పర దాడులు.. రాళ్లు, కత్తులతో చెలరేగిన అల్లరి మూకలు పరిస్థితి విషమించడంతో కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ ముగ్గురు మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం ఘర్షణల్లో 28 మందికి గాయాలు.. మూడు ఇళ్లు దహనం.. 50 వాహనాలు ధ్వంసం సిక్ చావ్నీలో కర్ఫ్యూ... పాతబస్తీలో 144 సెక్షన్ అమలు సంయమనం పాటించాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని పాతబస్తీ సిక్ చావ్నీలో ఒక జెండా విషయమై ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. వాగ్వాదం నుంచి మొదలై రాళ్లు, కత్తులతో దాడుల వరకూ వెళ్లింది. రెచ్చిపోయిన అల్లరి మూకలు వాహనాలు ధ్వంసం చేసి, ఇళ్లనూ తగులబెట్టాయి. పరిస్థితులు పూర్తిగా విషమిస్తుండడంతో.. బందోబస్తు విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 28 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘర్షణల నేపథ్యంలో 50కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలు తలెత్తిన కిషన్‌బాగ్ సిక్ చావ్నీ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. దీనికితోడు పాతబస్తీ ప్రాంతం మొత్తం 144 సెక్షన్ విధించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో సిక్ చావ్నీలోని హర్షమహల్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఓ వర్గం వారు కొన్నేళ్ల క్రితం పవిత్ర జెండా దిమ్మెను నిర్మించుకున్నారు. పర్వదినాల్లో అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. అయితే మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇక్కడి జెండాలను దహనం చేశారు. ఆ జెండాగద్దెని నిర్మించిన వర్గం వారు జెండాల దహనం విషయాన్ని తెలుసుకుని.. బుధవారం ఉదయం 6 గంటలకు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.. ఇది తెలిసిన మరో వర్గం వారు కూడా భారీ సంఖ్యలో అక్కడ గుమిగూడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, ఇన్స్పెక్టర్ కుషాల్కర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండా దిమ్మెపై కొత్త జెండాను ఏర్పాటు చేశారు. కానీ, పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో.. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో శంషాబాద్, మాదాపూర్ డీసీపీలు రమేష్‌నాయుడు, క్రాంతిరాణాలు సిక్ చావ్నీకి చేరుకుని ఇరువర్గాలకూ సర్దిచెప్పేందుకు దాదాపు గంట పాటు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా.. మరింత విషమించి ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు, కత్తులతో దాడులు చేసుకున్నారు. కనబడిన వాహనాలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. ఇళ్లు దహనం చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన వారితో పాటు ఎనిమిది మంది పోలీసులూ గాయపడ్డారు. చివరికి పరిస్థితిని అదుపుచేసేందుకు బందోబస్తు విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. బుల్లెట్ గాయాలైన మరో తొమ్మిది మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు హుటాహుటిన అదనపు బలగాలను మోహరించారు. సిక్ చావ్నీ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. పాతబస్తీ ఉన్న దక్షిణ మండలంలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. కాగా, పాతబస్తీలోని పరిస్థితులను గవర్నర్ నరసింహన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిక్ చావ్నీలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని, బాధ్యులను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు గవర్నర్‌కు వివరించారు. పుకార్లను నమ్మవద్దని, పూర్తిగా సంయమనం పాటించాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అప్రమత్తంగా ఉండండి: డీజీపీ సాక్షి, హైదరాబాద్, అనంతపురం: హైదరాబాద్‌లో ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. బుధవారం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లను అదుపు చేయడానికే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ సిక్‌చావ్నీలో జరిగిన ఘర్షణలపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షించారు. ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సిక్‌చావ్నీలో ఇరు వర్గాల మధ్య దీర్ఘకాలంగా విద్వేషాలున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రతలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని ఆయన అధికారులతో పేర్కొన్నట్లు తెలిసింది. -
'కిషన్‌బాగ్ పరిసర ప్రాంతాలవైపు రావద్దు'
హైదరాబాద్ : సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బుధవారం రాజేంద్రనగర్‌లో కర్య్పూ విధించారు. కిషన్ బాగ్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో పోలీసులు రంగంలోకి దిగారు. కిషన్ బాగ్‌తో 144 సెక్షన్ విధించి, చుట్టుపక్కల ప్రాంతాల్లో గస్తీ పెంచారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు రాజకీయ నేతలు, నాయకులు కిషన్ బాగ్ పరిసర ప్రాంతాల వైపు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇక దాడులకు పాల్పడినవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
మరదలిపై కత్తితో దాడి... బావ ఆత్మహత్యయత్నాం
హైదరాబాద్ నగరం పాతబస్తీ కిషన్‌బాగ్‌లో దారుణం. తనను ప్రేమించాలని ఓ బావ మరదలపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో మరదలిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం మరదలు ఇంటికి వచ్చిన అతడు ఆమెతో మాట్లాడుతూ కత్తితో అకస్మాత్తుగా దాడి చేశాడు. దాంతో ఆమె రక్తపు మడుగులోపడిపోయింది. అంతలో తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మరదలి ఇంట్లోని కుటుంబ సభ్యులు వెంటనే తేరుకుని వారిద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.