'కిషన్బాగ్ పరిసర ప్రాంతాలవైపు రావద్దు' | Tension prevails at Kishan bagh | Sakshi
Sakshi News home page

'కిషన్బాగ్ పరిసర ప్రాంతాలవైపు రావద్దు'

Published Wed, May 14 2014 11:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

'కిషన్బాగ్ పరిసర ప్రాంతాలవైపు రావద్దు'

'కిషన్బాగ్ పరిసర ప్రాంతాలవైపు రావద్దు'

హైదరాబాద్ : సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బుధవారం రాజేంద్రనగర్లో కర్య్పూ విధించారు. కిషన్ బాగ్ ప్రాంతంలో  రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో పోలీసులు రంగంలోకి దిగారు. కిషన్ బాగ్తో 144 సెక్షన్ విధించి, చుట్టుపక్కల ప్రాంతాల్లో గస్తీ పెంచారు.

ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు రాజకీయ నేతలు, నాయకులు కిషన్ బాగ్ పరిసర ప్రాంతాల వైపు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇక దాడులకు పాల్పడినవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement