Tension prevails
-
గొట్టిపాడులో అసలేం జరిగింది..
సాక్షి, గుంటూరు : ప్రస్తుతం గొట్టిపాడులో పరిస్థితి అదుపులోనే ఉందని గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు తెలిపారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు ఉందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామని, ఘర్షణకు కారణమైన ఇరువర్గాల వారిని గుర్తించే పనిలో ఉన్నామని ఎస్పీ వైటీ నాయుడు శనివారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్లు చెప్పారు. కాగా కొత్త సంవత్సర వేడుకలు గొట్టిపాడులో చిచ్చు రేపిన విషయం తెలిసిందే. ఇరువర్గాల మధ్య ఘర్షణల చివరకు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకునేవరకూ వెళ్లింది. ఒకదశలో పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోయారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామంలో 144 సెక్షన్ ను అమలు చేశారు. అసలేం జరిగింది... ఇళ్ల ముందు వేసిన ముగ్గుల మీదుగా బైకులు పోనిచ్చారన్న కారణంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకునే దాకా వెళ్లింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరికి ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య గొడవగా మారిపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా ఎస్సీ వర్గానికి చెందిన కొందరు యువకులు బైకులపై కేరింతలు కొడుతూ గ్రామంలో తిరిగారు. ఈ సమయంలో టీడీపీ నేతల ఇళ్ల ముందు వేసిన ముగ్గుల మీదుగా బైకులు వెళ్లడంతో అవి చెరిగిపోయాయి. దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ నేతలు ఎస్సీ యువకులపై దాడి చేశారు. దీంతో వారు ఎదురు తిరగటంతో పరస్పరం గొడవకు కారణమైంది. అయితే సోమవారం మధ్యాహ్నం మళ్ళీ ఇరువర్గాలూ ఎదురు పడటంతో వాగ్వాదం జరిగింది. కొద్దిసేపట్లోనే వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలూ రాళ్లు విసురుకున్నారు. కర్రలతో స్వైర విహారం చేశారు. ఫలితంగా పలువురికి గాయాలయ్యాయి. అధికారం అండతో అనవసరంగా తమపై దాడి చేశారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బైక్ ని కూడా లాక్కున్నారని ఆరోపించారు. దళితులమని తమపై చిన్నచూపు చూస్తున్నారన్నారు. టీడీపీ నేతల అండతో తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌లపై తిరగవద్దని హెచ్చరించడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. అన్యాయంగా తమపై దాడి చేసి కొట్టారని తెలిపారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కోన శశిధర్... గొట్టిపాడులో పర్యటించి, వివాదంపై ఆయన ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనతో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం న్యాయ విచారణ జరుపుతామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఈ వివాదంలో దోషులు ఎవరైనా శిక్ష తప్పదని అన్నారు. -
రణరంగంగా మారిన జమ్మలమడుగు
-
రణరంగంగా మారిన జమ్మలమడుగు
కడప: మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ దౌర్జన్యం చేసి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడటంతో కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతం రణరంగంగా మారింది. టీడీపీ, పోలీసులకు మధ్య జరిగిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. జమ్మలమడుగులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పాయువు ప్రయోగం చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్లు జరిపిన రాళ్ల దాడిలో పోలీసు ఎస్‌ఐసహా ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అధికారులు రంగంలోకి దిగారు. -
ఎంపీ అవినాష్ రెడ్డి కళ్లల్లో కారం చల్లిన టీడీపీ నేతలు
-
'కిషన్‌బాగ్ పరిసర ప్రాంతాలవైపు రావద్దు'
హైదరాబాద్ : సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బుధవారం రాజేంద్రనగర్‌లో కర్య్పూ విధించారు. కిషన్ బాగ్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో పోలీసులు రంగంలోకి దిగారు. కిషన్ బాగ్‌తో 144 సెక్షన్ విధించి, చుట్టుపక్కల ప్రాంతాల్లో గస్తీ పెంచారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు రాజకీయ నేతలు, నాయకులు కిషన్ బాగ్ పరిసర ప్రాంతాల వైపు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇక దాడులకు పాల్పడినవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
దుర్గామాత అమ్మవారి ఊరేగింపులో ఉద్రికత్త
హైదరాబాద్ : హైదరాబాద్ హయత్‌నగర్‌లో దుర్గామాత అమ్మవారి ఊరేగింపు ఉద్రిక్తతకు దారితీసింది. అమ్మవారికి పూలు వేస్తూ తమపై రాళ్లతో దాడి చేశారని పోలీసులు ఊరేగింపును అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారి ఊరేగింపు వాహనాన్నీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో శ్రీనివాసపురం కాలనీవాసులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. చివరికి తెల్లవారుజామున అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. -
నిజాం హాస్టల్లో టెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా నిజాం కాలేజీ హాస్టల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బయటి విద్యార్థులను (ఔటర్స్) హాస్టల్ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు హాస్టల్లోకి రావడాన్ని నిరసిస్తూ విద్యార్థులు హాస్టల్ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. వారిని కిందకు దింపేందుకు పోలీసులు వెళ్లడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలను ఝళిపించడంతో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. విద్యార్థులపై లాఠీచార్జిని ఓయూ జేఏసీ, టీఎస్ జాక్ తీవ్రంగా ఖండించాయి. ఇక ఏపీఎన్జీవోల సభలో ‘జై తెలంగాణ’ నినాదాలు కలకలం సృష్టించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పోలీసుల కన్నుగప్పి సభలోకి వెళ్లి తెలంగాణ నినాదాలు చేశారు. అలాగే ఇదే సభలో ప్రసంగాలు సాగుతుండగా వేదిక సమీపంలో విధుల్లో ఉన్న సిద్దిపేట సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ జై తెలంగాణ అంటూ నినదించారు. దీంతో వీరిద్దరిపై సభకు వచ్చిన వారిలో పలువురు దాడికి పాల్పడ్డారు. -
సచివాలయంలో కొనసాగుతున్న నిరసనలు
-
విద్యుత్ సౌధ వద్ద టెన్సన్.. టెన్సన్
-
విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత
-
విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత, ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్ : ఖైరతాబాద్ విద్యుత్ సౌధ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఈరోజు ఉదయం జేఎండీ పి.రమేష్‌కు సమ్మె నోటీసు అందచేశారు. అయితే ఆ నోటీసును ఆయన ఉద్యోగులపై విసిరి వేయటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమ్మె నోటీసు ఇచ్చేందుకు వెళితే జేఎండీ తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ ఉద్యోగులు విద్యుత్ సౌధ వద్ద ఆందోళనకు దిగారు. జేఎండీ రమేష్ తమకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తమ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.