సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో నగరంలో ఎవరూ ఆకలితో ఇబ్బంది పడకూడదని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. అలాంటి వారు ఎవరైనా తారసపడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు, తాము స్వచ్ఛంద∙సంస్థల సహకారంతో వారి ఆకలి తీరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎక్కడైనా అధిక ధరలకు నిత్యావసరాల విక్రయం, బ్లాక్‌మార్కెట్‌కు తరలింపుపై తమకు సమాచారం అందించాలన్నారు. నగర ప్రజలను ఉద్దేశించి సీపీ సోమవారం 9 నిమిషాల నిడివితో కూడిన ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఆయన మాటల్లోనే...
కరోనా వైరస్‌పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధంలో మనం అందరం పాల్గొంటున్నాం. దీనిని గెలవాలంటే అందరం సోషల్ ఐసోలేషన్, సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలి. మతపరమైన సెంటిమెంట్స్ కూడా పక్కన పెట్టి సమాజం కోసం లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తున్న వారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాలు కరోనా బారినపడి తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీనికి కారణం ఒక్కటే.. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తొలినాళ్లలో ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడమే. పేదలకు ఆహారం అందించడంలో ఎన్‌జీఓలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిత్యావసర వస్తువుల రవాణా చేసే వాహనాల కోసం ఇప్పటి వరకు సిటీలో 10 వేలకు పైగా పాసులు జారీ చేశాం. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే పోలీసుల్ని సంప్రదించాలి. నగరంలో కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. వీరిపై కఠన చర్యలు తీసుకుంటాం. కొందరు ఏకంగా పోలీసు కమిషనర్ వాయిస్‌ను, నాయకులను అనుకరిస్తూ ఆడియోలు సృష్టిస్తున్నారు. వీరితో పాటు నగరంలో రెడ్‌జోన్లు అంటూ వదంతులు పుట్టించిన వారిపైనా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment