సాక్షి సిటీబ్యూరో: కరోనా భయంతో జనం కూరగాయల వైపు చూస్తున్నారు. నాన్ వెజ్ ఎందుకులే.. అంత రిస్క్ ఎందుకనో ఏమో మాంసాహారం వైపు వెళ్లడం లేదు.చికెన్ తింటే కరోనా ప్రభావం ఉండదని ప్రకటనలు వస్తున్నా ఎందుకో జనం జంకుతున్నారు. ముక్క లేనిది ముద్ద దిగని వారు కూడా వెజిటేరియన్ ఫుడ్ తింటున్నారు. గ్రేటర్ పరిధిలో మాములు రోజుల్లో కంటే ఇటీవల కాలంలో కూరగాయల వినియోగం ఎక్కువగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
గ్రేటర్‌జనాభా..కూరగాయల డిమాండ్ ఇలా..
గ్రేటర్‌లో దాదాపు కోటిమంది నివాసముంటున్నారు. ప్రతిరోజూ 3వేల టన్నుల కూరగాయలు వినియోగించేవారు. అంటే ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కరికీ 300 గ్రాములు అవసరం. అయితే గత వారం రోజుల నుంచి కరోనా ప్రభావంతో నగర జనం నాన్‌వెజ్‌కు దూరమయ్యారు. అదనంగా మరో వెయ్యి టన్నుల కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. రోజు 4 వేల టన్నుల కూరగాయలు నగరవాసి వినియోగిస్తున్నాడు. నగరానికి రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచే కాక కర్నూలు, చిత్తూరు, అనంతపురం తదితర ప్రాంతాలనుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి.కర్ణాటక ప్రాంతానికి చెందిన చిక్‌బళ్లాపుర్ నుంచి వస్తున్నాయి. అతితక్కువ టమాట కేజీ రూ. 10 ఉండగా, అత్యధికంగా చిక్కుడు, బీరకాయ ధర కేజీ రూ. 40 వరకు ఉన్నాయి. ఇక వచ్చే నెల నుంచి కూరగాయల సీజన్ ముగుస్తుంది. ఇదే స్థాయిలో కూరగాయల వినియోగం ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
గ్రేటర్ పరిధిలో ఒక్క కొల్డ్‌ప్టొరేజ్ లేదు...
గ్రేటర్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కూరగాయలు నిలువ చేయడానికి ఒక్క కోల్డ్‌ప్టొరేజ్ లేదు. దీంతో స్థానిక సీజన్‌లో ఎక్కువ మోతాదులో కూరగాయలు, దుంపలు, ఆకుకూరలు మార్కెట్‌కు రైతులు తీసుకొస్తే ప్రభుత్వం కొనుగోలు చేసి వాటిని భద్రపర్చడానికి అవకాశం లేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రత్యామ్నాయం గురించిపట్టించుకోని ప్రభుత్వం
వచ్చే నెల ఏప్రిల్ నుంచి కూరగాయల సీజన్ ముగుస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా కూరగాయలు నగర మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. కూరగాయల వినియోగం ప్రస్తుతం ఉన్నట్లు ఉంటే వచ్చే నెలలో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయనుందో తెలియదు. సీజన్‌లో కూరగాయలు ఎక్కువ దిగుబడి అయితే వాటిని నిలువ చేసి అన్‌సీజ్‌లో ధరలు నిలకడగా ఉంచడానికి మర్కెటింగ్, హార్టికర్చర్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు.
Comments
Please login to add a commentAdd a comment