
రాజీనామాకైనా సిద్ధం: అక్బరుద్దీన్ సవాలు
ఉద్యోగాల భర్తీ అంశంపై సభలో మాట్లాడనీయకపోవడంపై ఎంఐఎం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. 344 నిబంధన కింద నోటీసులు ఇచ్చిన సభ్యులే మాట్లాడాలని స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు.
అయితే.. అదే నిబంధన కింద విద్యుత్ అంశంపై అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఎలా ఇచ్చారని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. అది బీఏసీ నిర్ణయమని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పగా.. అది బీఏసీ నిర్ణయమైతే ఆ డాక్యుమెంటును సభలో ప్రవేశపెట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. సభను మంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ అంశంపై రాజీనామాకైనా సిద్ధమని అక్బరుద్దీన్ సవాలు చేశారు.