
భార్యపై కోపంతో పిల్లలను చంపిన ప్రొఫెసర్
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (9), నంద విహారి (5) శవాలై కనిపించారు. వీరి మృతదేహాలను సైబరాబాద్ పోలీసులు మేడ్చల్ లోని బీరప్పగూడలో కనుగొన్నారు. వీరిని తండ్రే హత్యచేశాడని పోలీసులు తెలిపారు. తండ్రితో పాటు వెళ్లి వీరు అదృశ్యమైయ్యారు.
సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి గురుప్రసాద్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను హత్య చేసిన తర్వాతే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పిల్లలకు విషమిచ్చి హత్యచేసినట్టు వెల్లడించారు.
భార్య సుహాసినిపై కోపంతో అతడీ కిరాతకానికి ఒడిగట్టాడు. కన్నకొడుకులను కర్కశంగా హత్యచేసి పూడ్చిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. గురుప్రసాద్ సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా హత్యాస్థలిని కనుగొన్నారు. చిన్నారులను సొంత తండ్రే హత్యచేశాడని తెలియగానే గురుప్రసాద్ బంధువులు హతాశులయ్యారు.