
'వాళ్లు చేస్తే.. నేను రాజీనామా చేస్తా'
తనపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను సిద్ధమంటూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నల్లగొండ: తనపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను సిద్ధమంటూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తనపై అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన మండిపడ్డారు. అయితే ఆధార రహిత ఆరోపణలు చేసిన తప్పించుకుని తిరిగిన పొన్నం ప్రభాకర్ కోర్టుకు దొంగలా హాజరయ్యారని జగదీశ్ రెడ్డి విమర్శించారు.