ఇళ్ల బిల్లులు ఇచ్చేదాకా విశ్రమించం
వరుసగా ఉద్యమాలు, ధర్నాలు
టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం
వరంగల్ : ‘కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం అని 14 నెలల సమ యం ఇచ్చాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇక ఉపేక్షించం’ అని టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. వరంగల్ కరీమాబాద్‌లోని ఓ గార్డెన్స్‌లో జిల్లా కన్వీనర్ ఎడబోయిన బస్వారెడ్డి అధ్యక్షతన ఆదివారం పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. ఎన్నికల సందర్భంగా పేదలకిచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిం చారు. ఇందిరమ్మ బిల్లులపై సీఐడీతో విచారణ జరిపించినా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని విమర్శించారు.
రైతులను ఆదుకునేందుకు డబ్బు లేదా?
రాష్ట్రంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేం దుకు ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు ఉన్నాయి కాని రైతులను ఆదుకునేందుకే లేవా అని టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.జిల్లా పరిశీలకుడు ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోతల ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. పాత ప్రాజెక్టులు పూర్తి చే శాకే కొత్తవి మొదలుపెట్టాలని సూచించారు.
రసాభాసగా సమావేశం..
సమావేశం ముగింపు దశలో వరంగల్ తూర్పు ప్రాంతానికి చెందిన పలువురు కార్యకర్తలు జిల్లా నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇతర పార్టీలతో ఇబ్బందులు పడుతూ టీడీపీలో కొనసాగుతున్నా నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నా యకులు అవకాశం రాగానే వేరే పార్టీలోకి జారుకుంటున్నారని, తామే అన్యాయూనికి గురవుతున్నామని ఆక్రోశం వెలి బుచ్చారు. ఒకేసా రి కార్యకర్తలు ఎదురు తిరగడంతో దయాకర్‌రావు తదితరులు విస్తుపోయారు. అర్బన్‌పార్టీ నాయకుడు మురళి అనుయాయులు సముదాయించేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరి గింది.
5న జరిగే దీక్షా, ధర్నాను విజయవంతం చేయాలి
ఇళ్ల బిల్లుల కోసం ఈనెల 5న హౌసింగ్ కార్యాలయం ఎదు ట నిర్వహించే ఒక రోజు దీక్షా, ధర్నాను విజయవంతం చే యాలని టీడీఎల్పీ నేత దయాకర్‌రావు కోరారు. సమావేశ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దీక్షా, ధ ర్నాకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐలు మద్దతు ప్రకటిం చాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.10లక్షల కోట్లు కావాలన్నారు. ఇళ్ల బిల్లులు, ఇచ్చి న వాగ్దానాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాష్ట్ర వ్యాప్తం గా ఆందోళనలు చేపడుతామన్నారు. ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు సీత క్క, వేం నరేందర్‌రెడ్డి, నాయకులు అనిశెట్టి మురళి, గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేషం, మోహన్‌నాయక్, ఎం.సారంగం, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఉపేక్షించం
Published Mon, Aug 3 2015 2:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement