హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో విపక్షాలు గురువారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. మెట్రో రైలు ప్రత్యామ్నయ మార్గాలపై బీజేపీ, 10వ పీఆర్సీ అంశంపై సీపీఎం, బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన కులాలను తిరిగి చేర్చాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.
కాగా నేడు అసెంబ్లీలో జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ హౌసింగ్ సొసైటీల్లో అవకతవకలపై చర్చించే అవకాశం ఉంది. ఈ విషయమై టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.