మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధులు భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే దిశగా పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ ఐఎల్‌ఎఫ్‌ఎస్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) ఆసక్తి చూపింది. ఈ సంస్థ ప్రతినిధులు మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావుతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టనున్న పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. స్కై వేల నిర్మాణం, రింగ్ రోడ్లు, అంతర్గత ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్లు, హౌసింగ్ వంటి తదితర మౌలిక రంగాల అభివృద్ధి నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత చూపింది.
హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి సంస్థ ప్రతినిధులకు మంత్రి వివరించారు. పూర్తి విధివిధానాలతో ముందుకు రావాలని వారిని కోరారు. త్వరలోనే సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. సమావేశంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్‌లో పెట్టుబడులకు ‘ఐఎల్‌ఎఫ్‌ఎస్’ ఆసక్తి
Published Wed, Apr 13 2016 3:32 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM
Advertisement