జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి
ఆత్మకూర్ (నర్వ) : పాలమూరు జిల్లాలో నిరక్షరాస్యతను పారదోలుదామని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదే వి పిలుపునిచ్చారు. శనివారం అ మరచింత గ్రామంలో డీఎంఆర్‌ఎం ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రేరణ శిక్షణ తరగతులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సాం ఘిక దురాచారాలు.. మూధనమ్మకాలు, బాణామతి, ఆడపిల్లల పుట్టుక తో కుటుంబానికి అరిష్టం అనే భావాల తో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. విజ్ఙానం తెలి సిన ప్రతి వ్యక్తీ ఇలాంటి దురాచారాల పై స్పందించాల్సిన అవసరముందన్నారు. చదువుకుంటేనే కుటుంబంతోపా టు గ్రామాలు అభివృద్ధి చెందుతాయ న్న వాస్తవ విషయాలు నేటితరం విద్యార్థులు చాటి చెప్పాలన్నారు.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి కు టుంబానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీ సుకురావాలని కోరారు. గ్రామానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవా ది దేశాయి ప్రకాష్‌రెడ్డి తన ట్రస్టుతో ప్రేరణ తరగతులను నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వి ద్యావ్యాప్తి కోసం సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం ప్రేరణ తరగతులలో మంచి మార్కులు పాధిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశా రు. కార్యక్రమంలో నారాయణపేట డో స్వర్ణలత, ఎంఈఓ నర్సింహులు , డీ ఎంఆర్‌ఎం ట్రస్ట్ చైర్మన్ దేశాయి ప్రకాష్‌రెడ్డి, ఎత్తిపోతల సంఘం జిల్లా అధ్యక్షురాలు సౌజన్యరెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతిరెడ్డి, సైకాలజిస్టు శ్రీనివాసులు, రిటైర్ ఫా రెస్ట్ ఆఫీసర్ రామన్ గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేందర్ సింగ్, జ యసింహారెడ్డి, విజయ్, కలాంపాషా, నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిరక్షరాస్యతను పారదోలుదాం
Published Sun, Mar 15 2015 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement