మూడు రోజుల పాటు వర్షాలు | IMD Forecasts Little Bit Rainfall In Two Telugu States | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 24 2018 6:42 PM | Last Updated on Tue, Sep 4 2018 4:48 PM

IMD Forecasts Little Bit Rainfall In Two Telugu States - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని పేర్కొంది. దీని ఫలితంగా రానున్న మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయని ప్రకటించింది. 

తెలంగాణ
ఉపరితల ఆవర్తనం కారణంగా..ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తాంధ్ర
ఆది, సోమ వారాల్లో  కొన్ని చోట్ల, మంగళవారం అన్ని కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

రాయలసీమ
ఆది, సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement