ఏంచేసి బతకాలి..?
కళ్లెదుటే ఎండుతున్న పంటలు
పెద్దేముల్: కష్టపడి సాగుచేసిన పంటలు కళ్లెదుటే మాడిపొతున్నాయి. మూడు నెలల నుంచి బొట్టు వర్షం లేదు. వ్యవసాయ బోరు బావుల వద్ద వేసిన వరి పంటలు నీరందక మాడిపోతున్నాయి. కంది, పత్తి పంటలు వాడుపట్టాయి. పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలంటూ రైతులు లబోదిబోమంటున్నారు. పెద్దేముల్ మండలంలోని 33 రెవెన్యూ గ్రామాల్లో రైతులు 10వేల ఎకరాలకు పైగా కంది. పత్తి, వరి పంటలు సాగుచేశారు. ఖరీఫ్‌లో విత్తనాలు విత్తిన నాటి నుండి వరుణుడు కరుణించలేదు. ప్రస్తుతం మండలంలో వరి, పత్తి, కంది పంటలు పూర్తిగా పాడయ్యాయి. ఇప్పటికే చాలామంది రైతులు పనులు లేక వలసబాట పట్టారు.