కోల్‌సిటీ, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖనిలోని ఎల్బీనగర్‌కు చెందిన ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బీటెక్ చదువుతున్నారు. ఎల్బీనగర్‌లో ఫొటో, వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సిగిరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు సాయిచరణ్(21) హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చాడు. వీరి ఇంటి సమీపంలోనే అభిషేక్‌రాజ్, హరీశ్ నివసిస్తున్నారు.
అభిషేక్‌రాజ్ నల్గొండలో, హరీశ్ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరు కూడా ఓటు వేసేందుకు ఇంటికొచ్చారు. ప్రాజెక్ట్ వర్క్ ఉందని గోదావరిఖని నుంచి శనివారం ఉదయమే సంపర్క్‌క్రాంత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు ముగ్గురు రామగుండం రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడినుంచి హైదరాబాద్ వెళ్లారు. వీరు ముగ్గురూ హైదరాబాద్‌లో ఒకే బైక్‌పై, ఈసీఐఎల్ ప్రాంతంలోని రోడ్డుపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. సాయిచరణ్ అక్కడికక్కడే మృతిచెందగా, హరీశ్, అభిషేక్‌రాజ్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసి ముగ్గురు విద్యార్థుల కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లారు.
విషాదంలో సాయిచరణ్ కుటుంబ సభ్యులు
సాయిచరణ్ మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రతాప్‌రెడ్డి శనివారం భూపాలపల్లిలో ఓ వేడుకకు వీడియో,ఫొటోలు తీసేందుకు వెళ్లాడు. హైదరాబాద్ వెళ్తున్నా నని చెప్పిన కొడుకు రైలు దిగాక తండ్రికి ఫోన్ చేశాడు. ఇంతలోనే కొడుకు చనిపోయాడని తెలియడంతో ప్రతాప్‌రెడ్డి షాక్‌కు గురయ్యాడు. కెనడాలో ఉంటున్న పెద్దకొడుకు మహేందర్‌రెడ్డి కూడా ఈ విషయం తెలిసి హైదరాబాద్ బయలుదేరాడు.
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం
Published Sun, May 4 2014 2:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement