
బావిలో పడ్డ ఎలుగుబంటి
బోయినపల్లి: నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మొర్రి హన్మాండ్లు వ్యవసాయ బావిలో బుధవా రం రాత్రి ప్రమాద వశాత్తు ఓ ఎలుగుబంటి పడిపోయింది. అటవీశాఖ కొడిమ్యాల డెప్యూటీ రేంజి అధికారి జగన్‌మోహన్, ఫాజుల్‌నగర్ బీట్ ఆఫీస ర్ నరసింహస్వామి, బేస్‌క్యాంపు సిబ్బందితో కలి సి ఎలుగుబంటినిపైకి తీసేందుకు బావిలో నిచ్చెనలు వేశారు. నిచ్చెనల ద్వార పైకి వచ్చే అవకాశం ఉందని అటవీ అధికారులు పేర్కొన్నారు.