ఇంటింటి ప్రచారం చేస్తున్న మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రధాని మోదీ లాంటి చౌకీదార్.. రాహుల్ లాగ టేకేదార్ వ్యక్తులు దేశానికి అవసరం లేదని.. జిమ్మేదార్ లాంటి సీఎం కేసీఆర్ అవసరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం స్థానిక మోతీనగర్, మోటర్‌లైన్ ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారం, షాలీమార్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మైనార్టీల సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజలను నేరుగా కలుస్తు టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఙప్తి చేశారు.
అంతకుముందు మోతీనగర్‌లో ఏర్పాటుచేసిన సభలో హోంమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ.. జిల్లాకు ఇటీవల వచ్చిన ప్రధాని మోదీ నేను చౌకీదార్ అంటూ మా టలు చెప్పాడేగానీ జిల్లా గురించి ఏమీ మాట్లాడలేదని ఆరోపించారు. 70ఏళ్ల చరిత్రలో ముస్లింలు ఎక్కవ ఉన్న కశ్మీర్‌లో కూడా తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో షాదీముబారక్ కింద లక్ష 24 వేల మందికి రూ.624కోట్లు ఖర్చు చేసినట్లు తె లిపారు.
ఓ ముస్లింకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే ఇతర పార్టీలు చూశాయని సీఎం కేసీఆర్ మాత్రమే ముస్లింల çబా ధలను తీర్చారని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మచ్చలేని వ్యక్తిత్వమని ఆయన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
దేశంలోనే నంబర్‌వన్ సీఎం కేసీఆర్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సం క్షేమానికి కృషిచేస్తున్నారని, దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఫెడరల్ ఫ్రంట్‌తోనే దేశంలోని అన్ని వర్గాలకు స మన్యాయం లభిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతున్నదని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడినప్పుడే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న విషయాన్ని పొందుపరచడం జరిగిందని అన్నారు.
12 శా తం రిజర్వేషన్లకు టీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని, అందుకే అసెంబ్లీ, మండలిలో బిల్లుపాస్ చేయించినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ను మైనార్టీలు ఆదరించాలని పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మహబూబ్‌నగర్ లో ఐటీపార్క్ ఏర్పడనుందని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
‘పాలమూరు’కు జాతీయ హోదా
పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ వచ్చి జిల్లాకు ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మోసం చేశారని, 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇచ్చిన హామీ గురించి కూడా ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ, నల్లద్వారా మంచి నీల్లు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనన్నారు.
తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతి ఇద్దామన్నారు. పట్టణంలో ముస్లింల శ్మశానవాటిక కోసం 15ఎకరాలు కేటాయించడం జరిగిందని అన్నారు. మైనార్టీలు ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. -మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment