అరకొర సిబ్బంది.. తీరని ఇబ్బంది! | insufficient employees for election duties | Sakshi
Sakshi News home page

అరకొర సిబ్బంది.. తీరని ఇబ్బంది!

Published Thu, Mar 27 2014 12:02 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

insufficient employees for election duties

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  ఎన్నికల విధు ల కోసం జిల్లా యంత్రాంగం ఉద్యోగులను అన్వేషిస్తోంది. ఇప్పటికే ప్రభు త్వ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉద్యోగుల జాబితాను సేకరించిన యంత్రాంగం, అవసరాల మేరకు సమకూరకపోవడంతో కొత్త వారి కోసం వెతుకులాట సాగిస్తోంది. ఈ మేరకు ప్రైవేటు సంస్థల ఉద్యోగులను కూడా పోలింగ్ నిర్వహణకు వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఏప్రిల్ 30న జరిగే సాధారణ ఎన్నికల్లో సుమారు అరకోటి మంది ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ఇందుకుగాను ఆరు వేల పోలింగ్ బూత్‌లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది.

ఈ నేపథ్యంలో పోలింగ్ స్టేషన్‌కు సగటున ఐదుగురు ఉద్యోగులుండే లా కార్యాచరణ  తయారు చేసింది. దీనికి అదనంగా 10శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలోనే అత్యధిక  పోలింగ్ బూత్‌లు మన జిల్లాలోనే ఉండడంతో 35వేల మందిని ఎన్నికల విధులకు అవసరమవుతారని అంచనా వేసింది. ఇందులో రెండు వేల మంది సూక్ష్మ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే సీనియర్ అధికారులకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారీ మొత్తంలో అవసరమైన ఉద్యోగులను సమకూర్చడం యం త్రాంగానికి తలకుమించిన భారంగా మారింది.

 12వేలు కొరత!
 ఉద్యోగుల వేట ముమ్మరంగా కొనసాగిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు 12 వేల మంది కొరత కనిపిస్తోంది. వీరిని ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలో తెలియక జిల్లా యంత్రాంగం తలపట్టుకుంటోంది. దాదాపు పక్షం రోజులుగా ఉద్యోగులను గుర్తించడంలో తలమునకలైన అధికారులకు నిరాశే మిగిలింది. ఎన్నికల గడువు సమీపిస్తున్నందున ఆలోపు పోలింగ్ స్టాఫ్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాల్సివుంటుంది. మరోవైపు కేంద్ర పరిశీలకులు కూడా ఏప్రిల్ 1 నాటికి జిల్లాకు చేరుకుంటున్నారు.

 ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త శాఖల నుంచి ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు కలెక్టర్  శ్రీధర్ లేఖ రాశారు. ఇప్పటివరకు ఎన్నికల విధులకు దూరంగా ఉన్న శాఖలను కూడా ఈసారి రంగంలోకి దించితేనే గండం గట్టెక్కుతుందనే భావించిన అధికారులు పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏజీ ఆఫీస్, అరణ్యభవన్, రైల్వే, పాఠశాల విద్యాశాఖ, హౌసింగ్ బోర్డు తదితర శాఖలపై దృష్టి సారించారు.

 ‘విభజనే’ ముఖ్యం!
 ఇదిలావుండగా, పోలింగ్‌కు స్టాఫ్ కొరత తీవ్రం గా వేధిస్తున్నందున మొదటిసారి సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికల నిర్వహణకు వాడుకోవాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు జీఏడీ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే ఈసీ ప్రతిపాదనకు చుక్కెదురైంది. రాష్ట్ర విభజన కసరత్తు మెలిక పెడుతూ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం కాలేమని స్పష్టం చేసింది. విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు సెలవు దినాల్లో కూడా పనిచేస్తున్నందున, ఎలక్షన్ డ్యూటీలకు హాజరుకాలేమని తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాలలు, కళాశాల ల్లో పనిచేసే సిబ్బందిని కూడా వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ఈసీకి లేఖ రాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement