నెలాఖరున ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు | Inter 1st year results to be released end of this month | Sakshi
Sakshi News home page

నెలాఖరున ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

Published Tue, Apr 22 2014 5:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

Inter 1st year results to be released end of this month

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరపు ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో, ద్వితీయ సంవత్సరపు ఫలితాలు మే మొదటి వారంలో ప్రకటించనున్నారు. గవర్నరు సలహాదారు సలావుద్దీన్ అహ్మద్‌కు విద్యాశాఖ అధికారులు ఈ మేరకు వివరించారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, ఇంటర్మీడియెట్ కమిషనర్‌తో సలావుద్దీన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్‌తో పాటు ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 25 నుంచి జూన్ 1 వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు ఆయనకు వివరించారు.
 
 అనధికారిక కోతలతో ఇబ్బందులకు గురిచేయెద్దు...
 అనధికారిక విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని ఇంధనశాఖ అధికారులను గవర్నరు సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ ఆదేశించారు. ఇంధనశాఖ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 800 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు రెండో దశ యూనిట్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement