లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు పట్టు పడ్డాడు.
శ్రీరాంపూర్(ఆదిలాబాద్): లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు పట్టు పడ్డాడు. బిల్లులు పాస్ చేయడానికి ఇరిగేషన్ అధికారి, కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారు. అదిలాబాద్ జిల్లా శ్రీరాంపుర్ మండల ఇరిగేషన్ ఏఈఈగా పని చేస్తున్న సత్యనారాయణ దేవేందర్ అనే కాంట్రాక్టర్‌కు బిల్లులు పాస్ చేయడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రంగంలోకి దిగిన అధికారులు సత్యనారాయణ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారణ చేస్తున్నారు