పీసీసీ పదవి దక్కనందుకు జానారెడ్డి అసంతృప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంపై సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే జానారెడ్డి నిరాశకు గురయ్యారు. జానారెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలసి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు కొత్తగా పీసీసీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డికి అవకాశమిచ్చింది. ఇక సీమాంధ్ర పీసీసీ చీఫ్గా రఘువీరా రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్గా కేంద్ర మంత్రి చిరంజీవిలను నియమించారు.
తెలంగాణ పీసీసీ చీఫ్గా జానా రెడ్డి పేరు చివర వరకు వినిపించింది. ఓ దశలో ఆయననే నియమించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, చివర్లో అధిష్టానం పొన్నాల వైపు మొగ్గుచూపడంతో జానా అసంతృప్తికి గురయ్యారు.