హైదరాబాద్ నీళ్లు గజ్వేల్‌కా: జీవన్‌రెడ్డి | Jeevan Reddy comment on Cm kcr | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ నీళ్లు గజ్వేల్‌కా: జీవన్‌రెడ్డి

Published Sat, Jan 9 2016 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

హైదరాబాద్ నీళ్లు గజ్వేల్‌కా: జీవన్‌రెడ్డి

హైదరాబాద్ నీళ్లు గజ్వేల్‌కా: జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు అన్యాయం చేసే చర్యలకే సీఎం కేసీఆర్ ప్రాముఖ్యం ఇస్తున్నారని సీఎల్‌పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. సీఎల్‌పీ కార్యాలయం లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వేసవిలో హైదరాబాద్ జనానికి నీరు అందించేందుకు ఉద్దేశించి న గోదావరి జలాలను తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు తరలిస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటన్నారు. హైదరాబాద్ నగర ప్రజల దాహార్తి కన్నా తన నియోజకవర్గమే సీఎంకు ఎక్కువైందన్నారు.

ఈ పాటికి నగరంలో తిరగాల్సిన మెట్రో రైలు ఏడాది ఆలస్యం కావడానికి ముఖ్యమంత్రే కారణమన్నారు. ప్రకటనలు మినహా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజధాని కోసం ఏమీ చేయలేదని, తమ హయంలోనే అభివృద్ధి జరిగిందని జీవన్‌రెడ్డి ఉద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement