సాక్షి, బిచ్కుంద (కామారెడ్డి): భూములపై హక్కులు కల్పించాలని కోరుతూ మండలంలోని ఎల్లారం గిరిజన రైతులు ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఎదుట మోకరిల్లారు. గోపన్‌పల్లి గ్రామం వద్ద ఉన్న స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్‌లతో ఏర్పడిన కాలుష్యంతో ఆనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్తులు మంగళవారం గోపన్‌పల్లి శివారులో మొక్కలు నాటడానికి వచ్చిన ఎమ్మెల్యేకు వారు మొర పెట్టుకున్నారు. భూములపై కలెక్టర్‌తో చర్చించానని, ఆందోళన చెందొద్దని సింధే తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలిసి డాంబర్ ప్లాంట్‌తో పొగ, స్టోన్ క్రషర్‌తో ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 15 మంది క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారని చెప్పారు. ప్లాంట్లను మూసి తమ ప్రాణాలు కాపాడాలని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment