‘కేన్’ ఖతం
కేన్ వృక్ష సంపద ఖతమవుతోంది.. రాష్ట్రంలోనే అరుదైన మొక్కగా పేరుండటంతో దీని కలపను ఫర్నిచర్‌లో ఉపయోగించడం వంటి కారణాలతో మంచి డిమాండ్ ఉంది.. స్మగ్లర్ల దృష్టి కేన్‌పై పడింది.. రాత్రుళ్లు నిప్పు పెట్టి కలపను తరలిస్తున్నారు.. అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
- సాక్షి, హన్మకొండ
హన్మకొండ : వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్పగుడి సమీపంలో అరుదైన కేన్(సాపతీగబరిగె) చెట్లు ఉన్నాయి. తెలంగాణ రా ష్ట్రంలో ఇక్కడ మాత్రమే కేన్ చెట్లు ఉన్నాయి. వీటి కలపతో చేసిన ఫర్నిచర్‌కు మార్కెట్‌లో మంచి డి మాండ్ ఉంది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా స్మగ్లర్లు కేన్ కలప కోసం రామప్ప ప్రాంతాన్ని ఎంచుకుంటున్నా రు. అందులో భాగంగా కేన్ మొక్కల ఉనికి ప్రమాదంలో పడుతోంది. కేన్ చెట్టు మొదలు నుంచి చివరి వరకు పొడవుగా ఉండి బలిష్టమైన ముళ్లతో గుబురుపొదలా ఉంటుంది. దీనితో కలప స్మగ్లర్లు ఈ చెట్ల అడుగు భాగంలో నిప్పు పెడుతున్నారు. ముళ్లు మొత్తం కాలిపోయాక చెట్లను నరికి కలపను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కేన్ మొక్కలకు దుండగులు నిప్పు పెట్టారు. అయినా అటవీశాఖ అధికారుల్లో చలనం లేదు. తాజాగా కేన్ వృక్షాలు అరెకరం స్థలంలో తగలబడుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. దీనితో ఆరు ఎకరాల్లో విస్తరించిన కేన్ వృక్షాల పరిధి ఐదున్నర ఎకరాలకు పడిపోయింది.
ఒకప్పుడు 51 ఎకరాలు
కేన్ కలపకు డిమాండ్ ఉండటంతో స్థానికంగా ఉన్న కొందరు ఈ స్థలాల్లో సాగు చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ వ్యవహారమంతా అటవీశాఖ అధికారుల కనుసన్నల్లోనే సాగుతుండటంతో ఎవరూ అడ్డుకట్ట వేయడం లేదు. ఫలితంగా 1975లో 51.6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కేన్ వృక్షాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. రెండేళ్ల కిందట చేపట్టిన సర్వేలో ఆరెకరాల స్థలంలో కేన్ వృక్షాలు ఉన్నట్లుగా గుర్తించారు. సాగుపేరుతో సమీపంలోని రైతులు కేన్ వృక్షాల పరిధిలోకి రాకుండా అటవీశాఖ చుట్టూ కందకం తవ్వించింది. దీనితో ఏడాదిపాటు ఇటువైపు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. కానీ రెండు నెలలుగా స్మగ్లర్లు మళ్లీ పడగవిప్పారు. రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు ఈ వృక్షాలకు నిప్పు పెట్టారు.
అరుదైన జీవవైవిధ్యం
రామప్ప చెరువు కట్ట కింది భాగంలో ఏడాది పొడవునా ఇక్కడి నేలలో తేమ ఉంటుంది. ఒకప్పుడు ఇ క్కడ వందల ఎకరాల్లో కేన్ చెట్లు విస్తరించి ఉండేవి. ఒళ్లంతా ముళ్లు ఉండే కేన్‌మొక్కలు విస్తరించి ఉన్న ప్రాంతంలోకి మానుషులే కాదు ఇతర జంతువులు వె ళ్లడం కష్టం. అందువల్లే ఇక్కడ అరుదైన తెల్లమద్ది వృ క్షాలు ఉన్నాయి. కేన్‌చెట్ల మధ్య ఉన్న ఇతర వృక్షాలపై వేలసంఖ్యలో గబ్బిలాలు నివసిస్తూ ఉంటాయి. వాటితోపాటు మొత్తం 120 జాతుల పక్షులు ఇక్కడ ఆవా సం ఏర్పరుచుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అం దుకు గుర్తుగా అరుదైన జీవవైవిధ్య ప్రాంతంగా ఇక్క డ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా కేన్‌వృక్షాలు తగ్గిపోతున్నాయి. ఫలి తంగా జీవవైవిధ్యం సైతం ప్రమాదంలో పడుతోంది.