సాక్షి, హైదరాబాద్ : డిసెంబర్ 31వరకు పీఆర్సీ గడువు పెంచిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల పక్షాన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్‌ను కలిసినట్లు రవీందర్ రెడ్డి తెలిపారు.
పీఆర్సీ కమిషన్ అనేది వేతన సవరణ కోసమే ఏర్పాటు చెయ్యలేదని, ఉద్యోగుల అనేక విషయాల కోసం స్టడీ కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని సీఎస్ పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్యోగుల ఇతర సమస్యల పై స్టడీ కోసం మాత్రమే గడువు పొడిగించినట్లు సీఎస్ స్పష్టం చేశారన్నారుడుపీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉందని, నెల లోపలే కమిషన్ రిపోర్ట్ అందిస్తుందని సీఎస్ వివరించినట్లు తెలిపారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని రవీందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు అండగా ఉంటానని మాట ఇచ్చారని, తాను ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉన్నట్లు అనేక సార్లు చెప్పారని రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.
టీజీఓ అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. మంగళవారం పీఆర్సీ గడువు పెంచుతూ జీవో జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందారని తెలిపారు. అయితే ఇదే విషయమై సీఎస్‌ను కలిసిన తర్వాత పీఆర్సీకి ఈ గడువు పెంపుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపనట్లు పేర్కొన్నారు. అయితే గడువు పొడిగింపుతో సంబంధం లేకుండా ఏప్రిల్ నుంచి పీఆర్సీ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను కోరినట్లు మమత వెల్లడించారు. తమ సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని ఒక్కవేళ పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు మమత స్ఫష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment