సాక్షి, కీసర: మహాశివరాత్రి బ్రహోత్సవాల తరువాత కీసరగుట్టలో అత్యంత వైభవంగా జరుగనున్న కార్తీక మాసోత్సవాలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 7వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొదటి రోజున ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఆకాశదీపోత్సవంతో పూజలు ప్రారంభమై చివరి రోజున తైలాభిషేకం అన్నపూజతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ మేరకు కీసరగుట్టకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు, ఆలయ చైర్మన్ రమేష్‌శర్మలు తెలిపారు. భక్తుల కోసం క్యూ లైన్లు, సేదతీరేందుకు చలువపందిళ్లు, కార్తీకదీపాలను వెలిగించేందుకు యాగశాల, ఆలయానికి ఎదురుగా శివలింగాల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా లడ్డూ ప్రసాదాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, విద్యుత్ తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఏర్పాట్లు చుర్కుగా చేపడుతున్నారు.
పూజా వివరాలు...
నవంబర్ 8న ఆకాశదిపోత్సవం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కల్యాణం, 9న క్షీరాభిషేకం, 10న క్షీరాభిషేకం, 11న నాగుల చవితి, వాల్మీకి పూజ, పంచామృత అభిషేకం, 12న చెరుకు రసంతో అభిషేకం, 13న శ్రీ సుబ్రహ్మాణ్యేశ్వర స్వామి కల్యాణం, 17న క్షీరాభిషేకం, యథాశక్తి భిల్వార్చ న , 18న తేనే అభిషేకం, 19న సత్యనారాయణ స్వామి వత్రం, గంధాభిషేకం, 23న నానావిధ పుష్పార్చన, మహాలింగ దీపోత్సవం, జ్వాలా తో రణం, 24న నానవిధ ఫలరసాభిషేకం, 25న పంచామృతాభిషేకం, 26 క్షీరాభిషేకం, రామలింగేశ్వరస్వామివారి కల్యాణోత్సవం, డిసెంబర్ 1న ప ంచామృతభిషేకం, 2న చక్కరతో అభిషేకం, క్షీరాభి షేకం, 3న సత్యనారాయణ స్వామి వత్రం, క్షీ రాభిషేకం, 5న రుద్రహోమము, 7న తైలాభిషేకం, అన్న పూజతో కార్తీకమాసోత్సవాలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment