Keesaragutta Temple
-
Keesaragutta: కేసరగిరిలో హర హర మహాదేవ శంభో శంకర (ఫొటోలు)
-
కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
కీసరగుట్ట ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు
-
హరహర మహదేవ!‘మహా’ ప్రసాదం (ఫోటోలు)
-
Keesaragutta Temple: కీసర గుట్టపై శంభో శంకరా (ఫోటోలు)
-
భక్తులతో కిటకిటలాడుతున్న కీసరగుట్ట శివాలయం
-
కీసరగుట్ట జాతరకు రూ.50 లక్షలు
Maha Shivratri in Telangana, 2022: మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు, వసతుల కల్పనలో అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ హరీష్, జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, పోలీసులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు కీసరగుట్ట జాతర జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రత్యేక నిధులు విడుదల చేసిందని తెలిపారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశం, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ ఉమాపతి శర్మ, ధర్మకర్తల మండలి సభ్యుడు నారాయణ శర్మ, డీఆర్ఓ లింగ్యానాయక్, ఆర్డీఓలు రవికుమార్, మల్లయ్య, ఆలయ ఈఓ కట్ట సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో శాసనాల ప్రదర్శనశాల) -
శివనామస్మరణతో మారుమోగుతున్న కీసరగుట్ట
-
పోదాం కీసర..
కీసర: ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో బుధవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేటి నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లిఖార్జున అవధాని పర్యవేక్షణలో, కీసరగుట్ట ఆలయ పూజారులు బలరాంశర్మ, రవిశర్మ, ఆచార్య గణపతిశర్మ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు ఆలయ ఛైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ దంపతులు విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనము, రుత్విక్ పరణము, యాగశాల ప్రవేశము, అఖండజ్యోతి ప్రతిష్టాపన, తదితర కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతాయి. రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారికి నందివాహనసేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువస్తారు. భక్తుల సంఖ్యకుతగినట్లు ఏర్పాట్లు మహాశివరాత్రి బ్రహోత్సవాల సందర్భంగా 4 నుంచి 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చునని అధికారులు, ఆలయ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20 కమిటీలు ఏర్పాటు చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, శానిటేషన్, విషన్భగీరథ , వైద్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు షిఫ్టుల వారీగా విధుల్లో పాల్గొంటారు. నేడు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు: బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఏటా నిర్వహించే జిల్లా స్థాయి క్రీడోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జాతర సందర్బంగా ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆయా శాఖలకు సంబందించిన ప్రగతిపై ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. మంత్రి మల్లారెడ్డి , జిల్లాకలెక్టర్ వాసం.వెంకటేశ్వర్లు క్రీడోత్సవాలు, స్టాల్స్‌ను ప్రారంభిస్తారు. పకడ్బందీ ఏర్పాట్లు :బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఛైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ తెలిపారు. మంత్రి, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించే విషయమై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే లక్ష లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశామని, భక్తుల రద్దీ దృష్ట్యా అవసరమైతే ప్రసాదాల తయారీని పెంచుతామన్నారు.– ఆలయ ఛైర్మన్ తటాకంశ్రీనివాస్శర్మ పూజా కార్యక్రమాల వివరాలివీ.. మొదటిరోజు: 19 వ తేదీ (బుధవారం) ఉదయం 11గంటలకు విఘ్నేశ్వరపూజతో బ్రహోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం పుణ్యావాహచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం, అగ్నిప్రతిష్టాపన, బేరీపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, మంత్రపుష్పం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేస్తారు. 2వ రోజు: 20 తేదీ(గురువారం) ఉదయం 9గంటల నుంచి రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4 గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, రాత్రి 8గంటల నుంచి శ్రీస్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు వస్తారు. రాత్రి 10 గంటలకు శ్రీభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వరస్వామివార్ల కళ్యాణ మహోత్సవం. 3వ రోజు: 21వ తేదీ (శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినం రోజు తెల్లవారుజామున 4గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కళ్యాణమండపంలో సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహాకారహోమం, రాత్రి 8గంటలకు నందివాహన సేవ, భజనలు, రాత్రి 12 గంటల నుంచి లింగోద్బవ కాలంంలో శ్రీరామలింగేశ్వరస్వామికి సంతతధారాభిషేకం. 4వ రోజు: 22 వ తేదీ (శని వారం) ఉదయం 5.30 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 6 గంటల నుంచి కళ్యాణ మండపంలో సామూహిక అభిషేకాలు, ఉదయం 8 గంటలకు అన్నాభిషేకం, 9 గంటలకు రుద్రస్వాహాకారహోమం, రాత్రి 7గంటల నుంచిì ప్రదోశకాల పూజ, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామివారి విమానరథోత్సవం. 5వ రోజు: 23వ తేదీ( ఆదివారం )5.30 కు మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం,సాముహికఅభిషేకాలు, రాత్రి 7కు ప్రదోష కాలపూజ, హారతి, మంత్రపుష్పము, రాత్రి+ 8 గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం. 6వ రోజు: 24వ తేదీ(సోమవారం) మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం10 గంటలకు క్షేత్ర దిగ్బలి, అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాల పరిసమాప్తి, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
కీసరగుట్టలో ఆరు రోజుల వైభవం
కీసర: ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. మార్చి 7 వరకు ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. టీటీడీ వేద పాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, కీసరగుట్ట పూజారులు బలరాంశర్మ, రవిశర్మ, ఆచార్య పుల్లేటీకుర్తి గణపతిశర్మ ప్రధాన సంధానకర్తలుగా వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ దంపతులు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు అగ్నిప్రతిష్టాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7గంటలకు మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థప్రసాద వినియోగం, రాత్రి 8గంటలకు స్వామివారిని నందివాహన సేవ ద్వారా కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. మహాశివరాత్రి (సోమవారం) రోజున జాతరకు 8–10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 కమిటీలు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. నేటి నుంచి పారిశుధ్య, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, వైద్యశాఖ, విద్యుత్ తదితర అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. అదే విధంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతిఏటా నిర్వహించే జిల్లా స్థాయి క్రీడోత్సవాలను శనివారం ప్రారంభించనున్నారు. జాతర సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి క్రీడోత్సవాలు, ఎగ్జిబిషన్నుప్రారంభిస్తారు. పూజా కార్యక్రమాలివీ... తొలి రోజు (మార్చి 2): ఉదయం 11గంటలకు విఘ్నేశ్వర పూజతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. అనంతరం పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం, అగ్నిప్రతిష్టాపన, బేరీపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, మంత్రపుష్పం. రాత్రి 8గంటలకు స్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేస్తారు. రెండో రోజు: ఉదయం 9గంటల నుంచి రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం. రాత్రి 8గంటల నుంచి స్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేస్తారు. రాత్రి 10గంటలకు పూర్వాషాఢ నక్షత్రయుక్త కన్యలగ్నమందు శ్రీభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణోత్సవం. మూడో రోజు: మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున 4గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, రుద్రస్వాహాకార హోమం, రాత్రి 8గంటలకు నందివాహన సేవ, భజనలు, రాత్రి 12గంటల నుంచి లింగోద్భవ కాలంంలో శ్రీరామలింగేశ్వర స్వామికి సంతతదారాభిషేకం. నాలుగో రోజు: ఉదయం 5:30 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 6 గంటల నుంచి కల్యాణ మండపంలో సాముహిక అభిషేకాలు, 9గంటలకు రుద్రస్వాహాకార హోమం, రాత్రి 7గంటల నుంచి ప్రదోశకాల పూజ, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామివారి విమాన రథోత్సవం. ఐదో రోజు: ఉదయం 5:30గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం 8గంటలకు అన్నాభిషేకం, రాత్రి 8గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం. ఆరో రోజు: మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం10గంటలకు క్షేత్ర దిగ్బలి అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. పండగకు ప్రత్యేక బస్సులు సాక్షి, సిటీబ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసర, ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 2–7 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. సుమారు 150 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించారు. తార్నాక, ఉప్పల్, సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, కోఠి, దిల్సుఖ్నగర్, జేబీఎస్, ఏంజీబీఎస్, నాంపల్లి, ఈసీఐఎల్, అల్వాల్, పటాన్చెరు, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా... భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల సహకారంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. క్యూలైన్లలో ఉండే భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. ఇప్పటికే లక్షన్నర లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచాం. – తటాకం నారాయణశర్మ, ఆలయ చైర్మన్ -
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు
రాష్ట్ర రాజధానికి 35 కి.మీ దూరంలో ఉన్న ప్రఖ్యాత శైవక్షేత్రం. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా నిలుస్తోంది కీసరగుట్ట. భక్తులు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఆస్వాదించేందుకుఅనువైన దేవాలయం. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు కీసరగుట్టలోని రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా కీసరగుట్ట ప్రత్యేకత, ఇక్కడి సందర్శనీయ ప్రాంతాలపై ప్రత్యేక కథనం. ఆలయానికి మూడు ప్రత్యేకతలు.. ఇక్కడి శివాలయం పశ్చిమాభిముఖంగా ఉంది. గర్భగుడిలోని శివలింగం సైకత లింగంగా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ శివాలయానికి ఎదురుగా హనుమంతుడిచే విసిరివేసినట్లు చెబుతున్న శివలింగాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. కీసరగుట్ట దాని పరిసర ప్రాంతాల్లో 107 శివలింగాలు ఉండగా.. చివరి లింగం యాదాద్రి జిల్లాకొలనుపాకలో ఉంది. జైన విగ్రహాలు కూడా ఉండటం ఇక్కడి మరో విశేషం. ఆంజనేయస్వామి విగ్రహం: కీసరగుట్టలో భక్తుల విరాళాలతో ఇక్కడ 32 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఈ విగ్రహం ఎంతో కనువిందుచేస్తుంది. హుడాపార్కు యాత్రికులు సేదతీరేందుకు కీసరగుట్ట దిగువ ప్రాంతంలో ప్రభుత్వం హుడాపార్కును అభివృద్ధి చేసింది. సుమారు 20 ఎకరాల్లో ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఈ పార్కులో సేదతీరవచ్చు. టీటీడీ వేదపాఠశాల: కీసరగుట్ట దిగువ ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల ఉంది. భారతీయ సంసృతీ సంప్రదాయాలు, గురుకుల విద్య తరహాలో కొనసాగుతున్న వేదపాఠశాలను యాత్రికులు సందర్శించవచ్చు. ఇటీవల ఇక్కడ సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో వేద విద్యార్థుల సౌకర్యార్థం వివిధ భవనాలను టీటీడీ నిర్మించింది. దర్శనీయ ప్రాంతాలివీ.. సీతమ్మగుహ: ఏకశిలతో ఏర్పడిన సీతమ్మ గుహ సందర్శకులను ఆకట్టుకుంటుంది. మహిషా సురమర్దని ఆలయం ఈ గుహలో ఉంది. ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో సీతమ్మ గుహ ఉంది. భక్తులు వెళ్లడానికి ఇటీవల కొత్తగా ఆలయం నుంచి సీతమ్మ గుహ వరకు మెట్లు నిర్మించారు. మ్యూజియం: కీసరగుట్టను ఆయుధాగారంగా ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగించిన విష్ణుకుండినుల చరిత్రకు ఆనవాలుగా, రాజ ప్రాసాదాలు, నాణేలు, ఇటీవల బయట పడిన జైనతీర్థంకుల విగ్రహాలు) తదితర అవశేషాలను తిలకించేందుకు మ్యూజియాన్ని యాత్రికులు తిలకించవచ్చు. శివలింగాలు: కీసరగుట్టలో స్వామి వారి దర్శనానంతరం ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న 101 శివలింగాలను యాత్రికులు దర్శించవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శివలింగాలకు భక్తులు పాలు, పూలు, పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీ. తామర కొలను: ప్రధానకొండ దిగువ భాగంలో తెల్ల తామర కొలను యాత్రికులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. గుట్ట ప్రాంతమంతా అక్కడక్కడా ఉన్న రాతి మండపాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. అతిరథ మహాయాగంనిర్వహించిన ప్రదేశం సప్త సోమయాగాల్లో ఒకటైన అతిరథ మహా యాగాన్ని తపస్ సంస్థ ఆధ్వర్యంలో కేరళకు చెందిన నంబూద్రి వంశస్తులు కీసరగుట్టలో 2013 ఏప్రిల్ మాసంలో పదిరోజుల పాటు కీసరగుట్టలో నిర్వహించారు. ఈ యాగంతో ఈ ప్రదేశం ఎంతో ప్రవిత్రతను సముపార్జించుకుంది. యాత్రికులు అతిరథ మహాయాగం జరిగిన స్థలాన్ని కూడా సందర్శించవచ్చు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం: ప్రధాన ఆలయ సమీపంలో యోగి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఇక్కడి యోగి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవచ్చు. కీసరస్వామి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు చీర్యాల లక్ష్మీనర్సింహస్వామి, నాగారంలోని శివాలయం, షిరిడీ సాయి బాబా దేవాలయాలను కూడా దర్శించుకోవచ్చు. కీసరగుట్టకు ఇలాచేరుకోవచ్చు సాధారణ రోజుల్లో కీసరగుట్టకు సికింద్రాబాద్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఈసీఐఎల్ నుంచి 15 కి.మీ ప్రయాణిస్తే కీసరగుట్ట వస్తుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు, యాదాద్రి తదితర జిల్లాల్లోని గ్రామాల నుంచి ఆర్టీసీ 300 ప్రత్యేక బస్సులు నడపనుంది. యాత్రికుల సౌకర్యార్థం పున్నమి హోటల్, టీటీడీ ధర్మశాల, గెస్ట్ హౌస్‌లున్నాయి. -
నేటినుంచే కార్తీకమాసోత్సవాల ఏర్పాట్లు షురూ
సాక్షి, కీసర: మహాశివరాత్రి బ్రహోత్సవాల తరువాత కీసరగుట్టలో అత్యంత వైభవంగా జరుగనున్న కార్తీక మాసోత్సవాలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 7వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొదటి రోజున ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఆకాశదీపోత్సవంతో పూజలు ప్రారంభమై చివరి రోజున తైలాభిషేకం అన్నపూజతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ మేరకు కీసరగుట్టకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు, ఆలయ చైర్మన్ రమేష్శర్మలు తెలిపారు. భక్తుల కోసం క్యూ లైన్లు, సేదతీరేందుకు చలువపందిళ్లు, కార్తీకదీపాలను వెలిగించేందుకు యాగశాల, ఆలయానికి ఎదురుగా శివలింగాల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా లడ్డూ ప్రసాదాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, విద్యుత్ తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఏర్పాట్లు చుర్కుగా చేపడుతున్నారు. పూజా వివరాలు... నవంబర్ 8న ఆకాశదిపోత్సవం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కల్యాణం, 9న క్షీరాభిషేకం, 10న క్షీరాభిషేకం, 11న నాగుల చవితి, వాల్మీకి పూజ, పంచామృత అభిషేకం, 12న చెరుకు రసంతో అభిషేకం, 13న శ్రీ సుబ్రహ్మాణ్యేశ్వర స్వామి కల్యాణం, 17న క్షీరాభిషేకం, యథాశక్తి భిల్వార్చ న , 18న తేనే అభిషేకం, 19న సత్యనారాయణ స్వామి వత్రం, గంధాభిషేకం, 23న నానావిధ పుష్పార్చన, మహాలింగ దీపోత్సవం, జ్వాలా తో రణం, 24న నానవిధ ఫలరసాభిషేకం, 25న పంచామృతాభిషేకం, 26 క్షీరాభిషేకం, రామలింగేశ్వరస్వామివారి కల్యాణోత్సవం, డిసెంబర్ 1న ప ంచామృతభిషేకం, 2న చక్కరతో అభిషేకం, క్షీరాభి షేకం, 3న సత్యనారాయణ స్వామి వత్రం, క్షీ రాభిషేకం, 5న రుద్రహోమము, 7న తైలాభిషేకం, అన్న పూజతో కార్తీకమాసోత్సవాలు ముగుస్తాయి. -
చురుగ్గా సాగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
కీసర : కీసరగుట్టలో ఈనెల 11 నుంచి 16వ తేది వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఆలయం, ఆంజనేయస్వామి విగ్రహానికి , మహా మండపపంకు రంగులు వేశారు. పనులు జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి జిల్లా యంత్రాంగంతో రెండుసార్లు సమావేశమై పనులను ఈనెల 5, 6 తేదిల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. హుడాపార్కు నుంచి ఉత్తర ద్వార గుండా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లు, భక్తులు సేదతీరేందుకు ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్ల ఏర్పాటు పనులు పూర్తికావచ్చాయి. యాత్రికులు సేదతీరే గుట్ట దిగువ ప్రాంతంలోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌ను చదును చేస్తున్నారు. అదే విధంగా మరుగుదొడ్ల ఏర్పాటు, పార్కింగ్ లాట్ల ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయి. యాత్రికులకు అన్ని ఏర్పాట్లు: సామాన్య భక్తులకు దర్శనంలో ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏరాట్లు చేశాం. స్వామివారిని ఒకేసారి నలుగురు దర్శించుకునే విధంగా క్యూౖలైన్లు ఏర్పాటు చేశాం. అదేవిధంగా వీవీఐపీలకు స్వామి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశాం. ప్రసాదం కొరత రాకుండా ప్రత్యేక దృష్టి సారించాం.-ఆలయ ఛైర్మన్ తటాకం రమేష్‌శర్మ -
కీసర.. జన జాతర
కీసర: ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట మంగళవారం ఓంకారనాదంతో ప్రతిధ్వనించింది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో నిల్చున్నారు. సాయంత్రం వరకు దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు నందివాహన సేవను కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దర్శనానంతరం భక్తులు ఐదంతస్తుల రాజగోపురానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పసుపు, కుంకుమ, పాలు, నూనె, నెయ్యితో అభిషేకాలు చేశారు. మండపంలో పెద్ద ఎత్తున సామూహిక అభిషేకాలు నిర్వహించారు. స్వామిసేవలో ప్రముఖులు.. కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరుడిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నవారిలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ చామకూర మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మేడ్చల్, ఉప్పల్ ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ రజత్‌కుమార్ సైనీ, హైదరాబాద్ కలెక్టర్ నిర్మల, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. విశేషాలు.. - బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం వారు జారీ చేసిన వీఐపీ లింకు, వీఐపీ పాసులు భక్తుల సహనానికి పరీక్షపెట్టాయి. వీఐపీలింకు పాసులను 1500 మాత్రమే జారీ చేస్తామని చెప్పిన అధికారులు ఆ పాసుల సంఖ్యను 4వేలకు పైగా పంపిణీ చేశారు. అధికారులు వీవీఐపీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ ద్వారా త మ సిబ్బందిని, బంధువులను పంపించడం భక్తులను అసహనానికి గురిచేసింది. - క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు భారతి సిమెంట్, దేవస్థానం వారు మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేసారు. ఉదయం 11 గంటల వరకు ఓ మెస్తారుగా ఉన్న భక్తుల రాక ఆ తరువాత అనూహ్యంగా పెరిగింది. ధర్మదర్శనాలు, ప్రత్యేక దర్శనాల క్యూలైన్లు కిక్కిరిపోయాయి. దీంతో అధికారులు ప్రత్యేక దర్శనాలకు తరచూ విరామం ప్రకటిస్తూ ధర్శదర్శనాలను కొనసాగించారు. - మధ్యాహ్నం వివిధశాఖల అధికారులు, పార్టీల నేతలు తమ బంధుగ ణం, నాయకులను గర్భాలయంలోకి తీసుకెళ్తుండడంతో జేసీ రజత్‌కుమార్‌సైనీ రంగంలోకి దిగారు. గర్భాలయంలోకి ఎవరినీ వెళ్లకుండా బయటినుంచే స్వామివారిని దర్శించుకునేలా ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు గంట పాటు అక్కడే ఉండి క్యూలైన్లలో వెళ్లే భక్తులకు ఏవిధంగా దర్శనం అవుతుందో పరిశీలించారు. - శివరాత్రి జాగరణను పురస్కరించుకొని జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మధ్యాహ్నానికే ప్రసాదాల కొరత ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశకు గురయ్యారు. - స్థానిక మార్వాడి సంఘం, ఆర్యవైశ్య సంఘం, వంశరాజ్ సంక్షేమ సంఘం, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. - మంగళవారం ఒక్కరోజే 5 లక్షల లీటర్ల తాగునీటిని సరఫరా చేసినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. నేటి పూజా కార్యక్రమాలు - ఉదయం 5.30 గంటల నుంచి: మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం - ఉదయం 6 గంటల నుంచి: కల్యాణమండపంలో సామూహిక అభిషేకములు - ఉదయం 8 గంటలకు: అన్నాభిషేకం -ఉదయం 9 గంటలకు: రుద్రస్వాహకార హోమం - రాత్రి 7 గంటల నుంచి: ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పము - రాత్రి 10 గంటలకు: స్వామివారి విమాన రథోత్సవం -
ఆలయాలకు శ్రావణ శోభ
కీసర, న్యూస్‌లైన్: ప్రఖ్యాత శైవక్షేత్రమైన కీసరగుట్ట ఆలయంలో బుధవారం నుంచి సెప్టెంబర్ 5 వరకు శ్రావణ మాసోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆలయ వేదపండితులు పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. శ్రావణ మాసోత్సవాల సందర్భంగా ఈ నెల 7న స్వామి సన్నిధిలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 11న నాగుల పంచమి, 12న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కల్యాణం, నానాఫలరసాభిషేకం, 14న విశాఖ నక్షత్రం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణం, 16న వరలక్ష్మీ వ్రతం, 17న సత్యనారాయణ స్వామి వ్రతం, 18న నానావిధ పత్రి పూజ, 19న క్షీరాభిషేకం, 21న రాఖీ పౌర్ణమి వేడుక, 23న భస్మాభిషేకం, 24న గంధాభిషేకం, 31న శ్రీరామలింగేశ్వరస్వామివారి కల్యాణోత్సం, సెప్టెంబరు 1న శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, 2న పంచామృతాభి షేకం, 3న రుద్ర హవనం, యథాశక్తి బిల్వార్చన, 5న తైలాభిషేకం, అన్నపూజ కార్యక్రమాలతో శ్రావణమాసోత్సవ ప్రత్యేక పూజలు ముగుస్తాయన్నారు. శ్రావణమాసోత్సవాల సంద ర్భంగా కీసరగుట్టకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు వారు తెలిపారు. లడ్డూ ప్రసాదాలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు చెప్పారు. గర్భాలయ అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంటుం దని, ఈ సందర్భంగా సామాన్య భక్తులకు స్వామి దర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు.