మెదక్(జహీరాబాద్):మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి తనయుడు ఎం.కార్తీక్‌రెడ్డి ప్రపంచ సుడోకు పోటీలకు ఎంపికయ్యాడు. అండర్ -15 కేటగిరిలో ఈ మేరకు కార్తీక్‌రెడ్డి స్థానం పొందాడు. ఈనెల 24, 25వ తేదీల్లో చైనాలోని బీజింగ్‌లో ప్రపంచ పజిల్ ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నారు. కార్తీక్‌రెడ్డికి సుడోకు ఆడే విధానంపై జైపాల్‌రెడ్డి అవగాహన కల్పించారు. మూడు సంవత్సరాలుగా కార్తీక్‌రెడ్డి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జరిగే సుడోకు పోటీల్లో పాల్గొంటూ అనుభవం గడించాడు.
2014నవంబర్‌లో 6 ప్రధాన నగరాలలో నిర్వహించిన ప్రపంచ సుడోకు పోటీలలో జాతీయ స్థాయిలో కార్తీక్‌రెడ్డి టాప్-2లో నిలిచాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని గ్లోబల్ ఎడ్జ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. జైపాల్‌రెడ్డి సైతం ప్రపంచస్థాయి సుడోకు పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు. 2008, 2010, 2013, 2014సంవత్సరాల్లో నిర్వహించిన ప్రపంచస్థాయి సుడోకు పోటీల్లో జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. కార్తీక్‌రెడ్డి సైతం ఆయన బాటలోనే నడుస్తూ ప్రతిభను చాటుకుంటున్నాడు.