‘తెలంగాణకు దక్కిన గౌరవం’ | kasarla Nagender Reddy on Agriculture Leadership - 2017 Award | Sakshi
Sakshi News home page

‘తెలంగాణకు దక్కిన గౌరవం’

Published Sun, Aug 20 2017 1:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

kasarla Nagender Reddy on Agriculture Leadership - 2017 Award

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ – 2017 అవార్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రావడం తెలంగాణకు దక్కిన గౌరవమని టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు భారత ఆహార, వ్యవసాయ మండలి నుంచి పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరీ కింద ఈ అవార్డు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి రైతుకు న్యాయం జరిగేందుకే భూముల సర్వే చేపట్టారని, 24 గంటల కరెంటు ఇవ్వడమే కాకుండా రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీని కేసీఆర్‌ చేశారని గుర్తు చేశారు. మిషన్‌ కాకతీయ పథకాన్ని నీతి ఆయోగ్‌ ప్రశంసించిందని, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement