Kasarla Nagender Reddy
-
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్ రెడ్డి
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషిచేసిన కాసర్ల నాగేందర్ రెడ్డి మూడోసారి అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. అత్యధిక సభ్యత్వ నమోదుతోపాటు, అన్ని రాష్ట్రాలలో గులాబీ జెండా ఎగరవేసిన ఆయను తిరిగి ఎంపిక చేస్తూ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను, అభివృద్ధి, సంక్షేమపథకాలను ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ అటు సోషల్ మీడియాలో ఇటు తెలంగాణలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో భాగస్వాములవుతున్న కాసర్ల నాగేందర్ రెడ్డిని మూడోసారి అధ్యక్షుడిగా కల్వకుంట్ల కవిత ఆదేశాలతో NRI కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల నియమించారు. కవిత నివాసంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ చేస్తున్న కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నాగేందర్ రెడ్డి నూతన నియామక ఉత్తర్వులు అందజేశారు. కోర్ కమిటీలో డా. అనిల్ రావు చీటీ, రాజేష్ గిరి రాపోలు, సాయిరామ్ ఉప్పు, రవిశంకర్ దూపాటి, రవీందర్, నరేష్ రెడ్డితో పాటు దాదాపు 150 మందితో కమిటీ ప్రకటించారు. ఈ సందర్భంగా తమపై నమ్మకం ఉంచిన కవిత, మహేష్ బిగాలకు కొత్త కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. 2016లో ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ స్థాపించి మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కాసర్ల. -
‘తెలంగాణకు దక్కిన గౌరవం’
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ – 2017 అవార్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రావడం తెలంగాణకు దక్కిన గౌరవమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు భారత ఆహార, వ్యవసాయ మండలి నుంచి పాలసీ లీడర్షిప్ కేటగిరీ కింద ఈ అవార్డు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేందుకే భూముల సర్వే చేపట్టారని, 24 గంటల కరెంటు ఇవ్వడమే కాకుండా రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీని కేసీఆర్ చేశారని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిందని, ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు. -
ఆస్ట్రేలియా గులాబీమయం కావాలి
ఆస్ట్రేలియా టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడితో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాను గులాబీమయం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాం క్షించారు. పార్టీ కార్యకలాపాలను యథావిధిగా కొనసా గించాలని ఆస్ట్రేలియా టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డికి సూచించారు. సీఎం అధికారిక నివాసం లో నాగేందర్‌రెడ్డి... కేసీఆర్‌ను కలిసి తాము ఆస్ట్రేలి యాలో చేపడుతున్న, చేయబోతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఆస్ట్రేలియా టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన సీఎంను కలవడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ పార్టీకి భారీ స్పందన లభిస్తుం దని నాగేందర్‌రెడ్డి తెలియజేయగా... దానికి సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు. లండన్‌లో క్రిస్మస్ వేడుకలు... టీఆర్ఎస్ ఎన్నారై యూకే సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఉత్సవాలను వైభవంగా జరిపారు. టీఆర్ఎస్ ఎన్నారై యూకే సెల్ అధ్యక్షుడు పెద్దిరాజు, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ ఇతర సభ్యుల ఆధ్వర్యంలో సెయింట్ బార్తోలోమ్యూస్ చర్చ్‌లో వేడు కలను నిర్వహించారు. కార్యక్రమంలో క్రిస్మస్ విశిష్టత, ఏసు వైభవాన్ని కొని యాడుతూ పాటలు ఆలపించారు. సీఎం కేసీఆర్‌తో పాటు తెలంగాణ ప్రజ లంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని మత పెద్దలు ప్రార్థనలు చేశారు. అనం తరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని మతాలను గౌరవిస్తూ ఈస్ట్ లండన్‌లో వేడుకలు జరుపుకో వడం సంతోషంగా ఉందని ఈస్ట్ లండన్ ఇన్చార్జి రమేష్ ఎస్సంపల్లి తెలిపారు. -
సీఎంను కలిసిన ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షుడు
రాయికల్ : ఆస్ట్రేలియాలోని టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం ర్యాకదేవ్పల్లి గ్రామానికి చెందిన కాసర్ల నాగేందర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సేవల గురించి ఆయన సీఎంకు వివరించగా నాగేందర్‌రెడ్డిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
తెలుగు వ్యక్తికి 'ప్రవాసి ఎక్స్‌లెన్స్' అవార్డు
కరీంనగర్: ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 26 మంది ఎన్ఆర్ఐలకు 'ప్రవాసి ఎక్స్‌లెన్స్' అవార్డులను ప్రకటించారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన కాసర్ల నాగేందర్‌రెడ్డిని కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నాగేందర్ రెడ్డి 13 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో స్థిర పడ్డారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీఆర్ఎస్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఈనెల 18న హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటిలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకోనన్నట్లు ప్రవాసి మిత్ర మాస పత్రిక ఎడిటర్ మంద భీంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నాగేందర్‌రెడ్డిని ఆస్ట్రేలియా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు చీటి అనిల్‌రావు తదితరులు అభినందించారు. -
ఆస్ట్రేలియాలో కేసీఆర్ దీక్షా దివస్
రాయికల్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం దీక్షా దివస్ నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు మెల్బోర్న్లో శాంతియాత్ర చేపట్టారు. ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దీక్షతో తెలంగాణ సిద్ధించిందన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ఎన్నారైలంతా సహకరించాలని కోరారు. ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి రాంచంద్రు తేజావత్ హాజరయ్యారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఉపాధ్యక్షుడు అనిల్‌రావు చీటి, నాయకులు అర్జున్, అమర్‌రావు, మహ్మద్ జమాల్, అభినయ్, అమరేందర్‌రావు, ప్రకాశ్, ప్రవీణ్‌రెడ్డి, కల్యాణ్, మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.