ఆస్ట్రేలియా గులాబీమయం కావాలి
ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడితో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాను గులాబీమయం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాం క్షించారు. పార్టీ కార్యకలాపాలను యథావిధిగా కొనసా గించాలని ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డికి సూచించారు. సీఎం అధికారిక నివాసం లో నాగేందర్‌రెడ్డి... కేసీఆర్‌ను కలిసి తాము ఆస్ట్రేలి యాలో చేపడుతున్న, చేయబోతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన సీఎంను కలవడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో టీఆర్‌ఎస్ పార్టీకి భారీ స్పందన లభిస్తుం దని నాగేందర్‌రెడ్డి తెలియజేయగా... దానికి సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.
లండన్‌లో క్రిస్మస్ వేడుకలు...
టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఉత్సవాలను వైభవంగా జరిపారు. టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే సెల్ అధ్యక్షుడు పెద్దిరాజు, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ ఇతర సభ్యుల ఆధ్వర్యంలో సెయింట్ బార్తోలోమ్యూస్ చర్చ్‌లో వేడు కలను నిర్వహించారు. కార్యక్రమంలో క్రిస్మస్ విశిష్టత, ఏసు వైభవాన్ని కొని యాడుతూ పాటలు ఆలపించారు. సీఎం కేసీఆర్‌తో పాటు తెలంగాణ ప్రజ లంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని మత పెద్దలు ప్రార్థనలు చేశారు. అనం తరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని మతాలను గౌరవిస్తూ ఈస్ట్ లండన్‌లో వేడుకలు జరుపుకో వడం సంతోషంగా ఉందని ఈస్ట్ లండన్ ఇన్‌చార్జి రమేష్ ఎస్సంపల్లి తెలిపారు.