తెలుగు వ్యక్తికి 'ప్రవాసి ఎక్స్‌లెన్స్' అవార్డు
తెలుగు వ్యక్తికి 'ప్రవాసి ఎక్స్‌లెన్స్' అవార్డు
Published Mon, Dec 12 2016 8:28 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
కరీంనగర్: ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 26 మంది ఎన్‌ఆర్‌ఐలకు 'ప్రవాసి ఎక్స్‌లెన్స్' అవార్డులను ప్రకటించారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన కాసర్ల నాగేందర్‌రెడ్డిని కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నాగేందర్ రెడ్డి 13 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో స్థిర పడ్డారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
ఈనెల 18న హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటిలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకోనన్నట్లు ప్రవాసి మిత్ర మాస పత్రిక ఎడిటర్ మంద భీంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నాగేందర్‌రెడ్డిని ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు చీటి అనిల్‌రావు తదితరులు అభినందించారు.
Advertisement
Advertisement