ఆస్ట్రేలియాలో కేసీఆర్ దీక్షా దివస్
రాయికల్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం దీక్షా దివస్ నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు మెల్‌బోర్న్‌లో శాంతియాత్ర చేపట్టారు. ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దీక్షతో తెలంగాణ సిద్ధించిందన్నారు.
బంగారు తెలంగాణ సాధనలో ఎన్నారైలంతా సహకరించాలని కోరారు. ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి రాంచంద్రు తేజావత్ హాజరయ్యారు. టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఉపాధ్యక్షుడు అనిల్‌రావు చీటి, నాయకులు అర్జున్, అమర్‌రావు, మహ్మద్ జమాల్, అభినయ్, అమరేందర్‌రావు, ప్రకాశ్, ప్రవీణ్‌రెడ్డి, కల్యాణ్, మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.