ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషిచేసిన కాసర్ల నాగేందర్ రెడ్డి మూడోసారి అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. అత్యధిక సభ్యత్వ నమోదుతోపాటు, అన్ని రాష్ట్రాలలో గులాబీ జెండా ఎగరవేసిన ఆయను తిరిగి ఎంపిక చేస్తూ ఎంఎల్‌సీ కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ కార్యక్రమాలను, అభివృద్ధి, సంక్షేమపథకాలను ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ అటు సోషల్ మీడియాలో ఇటు తెలంగాణలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో భాగస్వాములవుతున్న కాసర్ల నాగేందర్ రెడ్డిని మూడోసారి అధ్యక్షుడిగా కల్వకుంట్ల కవిత ఆదేశాలతో NRI కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల నియమించారు. కవిత నివాసంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ చేస్తున్న కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నాగేందర్ రెడ్డి నూతన నియామక ఉత్తర్వులు అందజేశారు.
కోర్ కమిటీలో డా. అనిల్ రావు చీటీ, రాజేష్ గిరి రాపోలు, సాయిరామ్ ఉప్పు, రవిశంకర్ దూపాటి, రవీందర్, నరేష్ రెడ్డితో పాటు దాదాపు 150 మందితో కమిటీ ప్రకటించారు. ఈ సందర్భంగా తమపై నమ్మకం ఉంచిన కవిత, మహేష్ బిగాలకు కొత్త కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. 2016లో ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ స్థాపించి మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కాసర్ల.
Comments
Please login to add a commentAdd a comment