కాజీపేటరూరల్ : కాజీపేట రైల్వే సమస్యలను కాజీపేట తెలంగాణ రైల్వే జేఏసీ బృందం ఈనెల 25వ తేదీన ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించనుంది. ఈ మేరకు అనుమతి లభించినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ బి.రాంనాథం ఆదివారం తెలిపారు. జేఏసీ బృందం ఈ నెల 24న ఢిల్లీకి బయలుదేరనుందని పేర్కొన్నారు.
విన్నవించే సమస్యలివే..
రెండున్నర దశాబ్దాల క్రితం కాజీపేటకు మంజూరై పంజాబ్‌లోని కపుర్తాలకు తరలిన కోచ్‌ఫ్యాక్టరీ స్థానంలో ఇక్కడ కొత్తగా కోచ్‌ఫ్యాక్టరీ మంజూరు చేయూలి.
కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలి. జంక్షన్ సబ్ డివిజన్ పరిధిలో ప్రధాన రైల్వే డిపోలను అభివృద్ధి చేయూలి.
కాజీపేటకు మంజూరైన రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలి, పిట్‌లైన్లను నిర్మించాలి.
డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్లను పీఓహెచ్ షెడ్లుగా, ఇక్కడి రైల్వే ఆస్పత్రిని సబ్‌డివిజన్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయూలి.
ఐటీఐ విద్యార్థులకు అప్రెంటీస్ ఆక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించి ఢిల్లీ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ, చెన్నై, కేరళ, తదితర దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలి.
కాజీపేట జంక్షన్ నుంచి విజయవాడ, బల్లార్షా మార్గంలో కొత్త రైళ్లు ప్రారంభించాలి.
కాజీపేట రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్‌లో సెంట్రల్ సిలబస్‌ను ప్రవేశపెట్టి బయటి విద్యార్థులకు కోటా కల్పించాలి.
ప్రధాని దృష్టికి కాజీపేట రైల్వే సమస్యలు
Published Mon, Nov 10 2014 4:09 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement