ఢిల్లీకి కేసీఆర్‌ | Kcr heads to delhi for eye treatment | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి కేసీఆర్‌

Published Wed, Jun 21 2017 10:12 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

ఢిల్లీకి కేసీఆర్‌ - Sakshi

ఢిల్లీకి కేసీఆర్‌

23న కోవింద్‌ ‘రాష్ట్రపతి’ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్న కేసీఆర్‌
కేంద్ర మంత్రులతో భేటీ.. కంటి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. కొన్ని అధికారిక కార్యక్రమాలతో పాటు కేసీఆర్‌ తన కంటికి శస్త్ర చికిత్స కూడా చేయించుకుంటారని తెలిసింది. నిజానికి ఈ శస్త్రచికిత్స కోసం మే లోనే సీఎం తన కుటుంబసభ్యులతో పాటు ఢిల్లీ వెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, కొద్ది రోజుల తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్టు సమాచారం.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 23న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. కోవింద్‌ అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్‌ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆ మేరకు ఈ పర్యటనలో శస్త్ర చికిత్స చేయించుకోవచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement