సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుపడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధు పథకం అమలవుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు బంధు కమిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (‘పవర్’కు పంప్‌హౌస్‌లు)
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయండి
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు. (విద్యార్థులకు శుభవార్త: కేసీఆర్ కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment