సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పీ శ్వేత
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రి నుంచి కిడ్నాప్‌నకు గురైన బాలుడిని సీసీ కెమెరాలే కాపాడాయని ఎస్‌పీ శ్వేత అన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ప్రాధాన్యతను ఇకనైనా గుర్తించాలన్నారు. సోమవారం జిల్లా కేం ద్రంలోని ఏరియా ఆస్పత్రి వద్ద జరిగిన బాలుడి కిడ్నాప్ ఉధంతంపై మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
పట్టణంలోని అజంపుర కాలనీకి చెందిన అయాన్ అనే ఏడేళ్ళ బాలుడు తన తల్లి ఫాతిమా వెంట ఆస్పత్రికి వచ్చాడు. బయట ఆడుకుంటున్న అయాన్‌ను రాజీవ్‌నగర కాలనీకి చెందిన షేక్ నసీరుద్దీన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు కిడ్నాప్ జరుగగా 4.30 గంటలకు పోలీసులకు సమాచారం వచ్చింది. 6 బృందాలను ఏర్పాటు చేసి పట్టణంలో గాలించారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించామన్నారు. ఆస్పత్రి పక్కనే ఉన్న క్యాంటీన్‌లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాలుడు కిడ్నాప్‌నకు గురైనట్లు గుర్తించామన్నారు. సీసీ ఫు టేజీ ఆధారంగానే కేసును కేవలం ఐదున్నర గంటలలోపు చేధించి బాలుడిని తల్లి ఒడికి చేర్చడం సాధ్యపడిందన్నారు. అక్కడ సీసీ కెమెరాలు లేకుం టే బాలుడి ఆచూకీ కనిపెట్టడంలో ఆలస్యం జరిగేదన్నారు.
చిన్న వ్యాపారమే అయినా తన క్యాంటీన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న పి. సంగమేశ్వర్‌ను శాలువాతో సత్కరించి ప్రత్యేకం గా అభినందించారు. బాలుడిని ఎత్తుకెళ్ళిన నసీరుద్దీన్ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసై డబ్బుల కోసమే కిడ్నాప్ చేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి కిడ్నాప్‌నకు గల కారణాలను వెల్లడిస్తామన్నారు.
సీసీ కెమెరాల ప్రాధాన్యత గుర్తించాలి
సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ఒక సా మాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలని ఎస్‌పీ శ్వేత సూచించారు. గతంలోనూ జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ అనే నాలుగేళ్ళ బాలుడు కనిపించకుండాపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేక బాలుడి ఆచూకీ తెలియలేదన్నారు. సీసీ కెమెరాలున్న చోట నేరం జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.
జరిగినా, నేరస్తులను పట్టుకోవడం సులువవుతుందన్నారు. పట్టణంలో ఇదివరకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంజూరు చేసిన నిధులతో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ కోసం ము న్సిపల్ అధికారులకు సూచనలిచ్చామన్నారు. వా టి వాడకంపై సబ్ డివిజన్‌కు ఒక అధికారికి ప్రత్యే క శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఎస్‌పీ వెల్లడించారు.
నేరాల నియంత్రణకు సాధనంగా ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాలని సూచించారు. డీఎస్‌పీ ప్రస న్నరాణి, పట్టణ ఎస్‌హెచ్‌ఓ శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ యాదగిరిగౌడ్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment