కిషన్‌రెడ్డి తెలంగాణలో పుట్టాడా? ఆంధ్రాలోనా?
పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
ముస్తాబాద్:తెలంగాణలో నాణ్యమైనవిద్యుత్ ఇవ్వాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుం టే కేవలం ఉనికి కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాడని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. అసలు కిషన్‌రెడ్డి తెలంగాణలో పుట్టిండా..? ఆంధ్రాలో పుట్టిండా? అని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లో ఆదివారం కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్ర సీఎం చంద్రబాబు శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని లేఖ రాసినా స్పందించని బీజేపీ.. రైతులను ఆదుకునేందుకు తెలంగాణ సీఎం పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తే రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.
ద్రంలో బీజేపీ అధికారంలో ఉండికూడా రాష్ర్టంలో ఆ పార్టీ నాయకులు తెలంగాణకు విద్యుత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించరని అన్నారు. బీజేపీతో టీడీపీ కుమ్మక్కై తెలంగాణపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలను బెదిరింపులకు గురిచేస్తూ ఆంధ్ర సీఎం కుట్ర పన్నుతున్నాడన్నారు. తట్టెడు బొగ్గు ఉత్పత్తి లేని కడప, విజయవాడలో విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుందో... తెలంగాణ బీజేపీ, టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు చేసిన పాపం వల్లే తెలంగాణలో ఇప్పుడు కరెంటు కష్టాలు వచ్చాయన్నారు.