కాంగ్రెస్‌లోకి బాహుబలి కాదు..బఫూన్లు వస్తరు: కేటీఆర్‌ | KTR comments on congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి బాహుబలి కాదు..బఫూన్లు వస్తరు: కేటీఆర్‌

Published Sun, Mar 19 2017 3:35 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

కాంగ్రెస్‌లోకి బాహుబలి కాదు..బఫూన్లు వస్తరు: కేటీఆర్‌ - Sakshi

కాంగ్రెస్‌లోకి బాహుబలి కాదు..బఫూన్లు వస్తరు: కేటీఆర్‌

సిరిసిల్ల: కాంగ్రెస్‌ పార్టీలోకి బాహుబలి కాదు.. బఫూన్లు వస్తరని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బాహుబలి వస్తారని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ‘ఇక మాతో ఏమీ కాదని తేలిపోయి.. బాహుబలి వస్తారని అంటున్నారని.. బాహుబలి కాదు.. బఫూన్లు వస్తారని, కాటమరాయుళ్లు వచ్చినా.. కేసీఆర్‌ ముందు వాళ్ల కుప్పి గంతులు పనిచేయ’ వన్నారు.

బుద్ధి ఉన్నోడు ఎవరూ కాంగ్రెస్‌లో చేరబోరని, ఆ పాచిపోయిన ముఖాలను ప్రజలు చూడరని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. దేశంలో సకల దరిద్రాలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీడీపీ ఓ చిల్లరగాళ్ల పార్టీ అని, చంద్రబాబునాయుడు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లాడని పేర్కొన్నారు. తెలంగాణలో చంద్రబాబుది ఖేల్‌ ఖతం.. దుకాణం బంద్‌ అయిందన్నారు. ఇక సీపీఐ, సీపీఎం పార్టీలతో ఊదుగాలదు.. పీరీలేవదని కేటీఆర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement