ప్రకృతా.. అయితే ఓకే  | KTR Funny Chat With Journalists | Sakshi
Sakshi News home page

ప్రకృతా.. అయితే ఓకే 

Published Sat, Jan 19 2019 7:59 AM | Last Updated on Sat, Jan 19 2019 8:10 AM

KTR Funny Chat With Journalists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అసెంబ్లీ ప్రాంగణంలో పాత్రికేయులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. శుక్ర వారం సభ వాయిదా పడిన అనంతరం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయం వద్ద ఆయనను కలిసేందుకు ప్రయత్నించిన  జర్నలిస్టులను ఆత్మీయంగా పలకరించారు.

ఓ జర్నలిస్టు పసుపు పచ్చ రంగు వేసుకుని ఉండటాన్ని చూసిన కేటీఆర్‌ ‘పచ్చరంగు చొక్కానా..? ఆ రంగు లేకుండా చేద్దామనుకుంటుంటే ఆ రంగు చొక్కానే వేసుకొచ్చావా?’అని సరదాగా అన్నారు. దీనికి ప్రతిస్పందించిన ఆ జర్నలిస్టు పచ్చరంగు ప్రకృతిలో భాగమే కదా అన్నారు. ఆ మాట సరిగా వినబడకపోవడంతో మళ్లీ అడిగి తెలుసుకున్న కేటీఆర్‌ ప్రకృతేనా...వికృతి కాదు కదా..! అంటూ నవ్వుతూ బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement