యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో వీడియోను పోస్టు చేశారు. ప్రతి ఫొటోలో యాదాద్రి పునర్ నిర్మాణ విశిష్టతను పేర్కొన్నారు. ‘యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. కొత్త హంగులతో ఆలయం భక్తులకు దర్శనం ఇవ్వనుంది. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం సీఎం కేసీఆర్ మరో గొప్పతనం’అని పేర్కొన్నారు. ఆలయం పునర్ నిర్మాణం మొత్తం రాతితోనే జరిగిందన్న ఆయన.. రెండున్నర లక్షల టన్నుల గ్రానైట్‌ను ఉపయోగించినట్లు తెలిపారు.
ఆలయం మొత్తం గ్రానైట్‌తో కట్టిన, దేశంలో అతిపెద్ద టెంపుల్‌గా యాదాద్రి నిలిచిపోతుందని, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం, ప్రాచీన కట్టడం మాదిరిగా పునర్ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే 2000 సంవత్సరాల వరకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, భారత్‌లోనే అద్భుత కట్టడంగా ఆలయం నిలిచిపోతుందని ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ పోస్టును స్థానిక యువకులు డౌన్‌లోడ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్‌గా, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి ఇతరులకు షేర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment