సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ కూలీల హాజరు నమోదుకు ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రా నిక్ మస్టర్ విధానాన్ని తప్పనిసరిగా అవలం భించాలని అధికారులను గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ ఆదే శించారు. గత కొన్ని నెలలుగా మాన్యువల్‌గా హాజరును నమోదు చేస్తున్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల డీఆర్‌డీవోలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయిలో ఉపా ధి హామీ పనుల తీరుపై గురువారం అన్ని జిల్లాల డీఆర్‌డీవోలతో ఆమె వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఎంపీ డీవోలు కూడా రావాలని సూచించినప్పటికీ, కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువ మంది గైర్హాజరవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరుకాని ఎంపీడీవోలకు నోటీ సులు జారీ చేయాలని డీఆర్‌డీవోలకు సూచిం చారు. గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు.