భూమి విషయమై తలెత్తిన వాగ్వాదం ఒకరి ప్రాణాలు తీసింది.
చెన్నూర్(ఆదిలాబాద్): భూమి విషయమై తలెత్తిన వాగ్వాదం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఆదిలాబాద్ చెన్నూర్ మండలం ముత్తారావుపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన చిన్నపురెడ్డి చిన్నన్న(65), అతని సోదరుని కుటుంబానికి మధ్య భూ తగాదాలున్నాయి. ఇదే విషయంలో ఆదివారం మధ్యాహ్నం రెండు కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది.
మాటామాటా పెరిగి చిన్నన్నను అతని అన్న కుమారుడు రాజిరెడ్డి బలంగా వెనక్కి నెట్టడంతో కిందపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న చిన్నన్నకు కొద్దిసేపటికే ఛాతిలో నొప్పి వచ్చింది. నొప్పి తీవ్రమై అతడు కొద్దిసేపట్లోనే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.