హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ బార్ అసోసియేషన్ మంగళవారం హైకోర్టులో ఆందోళన చేపట్టింది. ఛలో హైకోర్టు పిలుపుతో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున న్యాయవాదులు తరలివచ్చి నినాదాలు చేశారు. కోర్టులో కేసులు విచారణ జరుగుతుండగానే ఆవరణలో జై తెలంగాణ నినాదాలు మారు మోగాయి. ఆందోళన ఎక్కువ కావడంతో పోలీసులు భారీగా మొహరించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.