బార్ అసోసియేషన్ కార్యాలయ భవనానికి భూమి పూజ
కర్నూలు(లీగల్) : కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘ నూతన కార్యాలయ భవనానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లాపరిపాలనా పర్యవేక్షకులు జస్టిస్ ఎస్.వి.భట్ శనివారం భూమిపూజ చేశారు. ఉదయం 8:30 గంటలకు స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు న్యాయవాదుల సంఖ్య అనుగుణంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తామని జస్టిస్ ఎస్వీ భట్ తెలిపారు. తన గ్రంథాలయాన్ని న్యాయవాద సంఘానికి వితరణగా ఇచ్చిన సీనియర్ న్యాయవాది బి.జంగంరెడ్డికి సభాపూర్వకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.ఓంకార్, కె.కుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.